సూర్యతో పోటీపడిన జ్యోతిక.. వీడియో వైరల్‌ | Sakshi
Sakshi News home page

జిమ్‌లో సూర్యతో పోటీపడిన జ్యోతిక.. వీడియో వైరల్‌

Published Wed, Apr 3 2024 9:46 AM

Surya And Jyothika's Gym Video Goes Viral - Sakshi

సౌత్‌ ఇండియాలో జ్యోతిక- సూర్య స్టార్‌ కపుల్స్‌ అని చెప్పవచ్చు. వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్‌తో ఎందరినో ఆకట్టుకున్నారు. ఇద్దరూ సినిమా రంగంలోనే ఉండటంతో ఫిట్‌నెస్‌ కూడా చాలా అవసరం. సూర్య పాన్‌ ఇండియా సినిమాలు తీస్తుంటే.. జ్యోతిక మాత్రం కోలివుడ్‌ చిత్రాలతో పాటు బాలీవుడ్‌ మూవీస్‌ కూడా చేస్తుంది.

తాజాగా ఒక వీడియోను జ్యోతిక షేర్‌ చేసింది. సూర్యతో కలిసి జిమ్‌లో వర్క్ అవుట్స్ చేసిన దృశ్యాలను అభిమానులతో పంచుకుంది. జిమ్‌లో సూర్యతో పోటీ పడుతూ జ్యోతిక భారీ వర్కౌట్స్‌ చేసింది.  జిమ్‌లో ప్రతి వర్కౌట్‌ను జ్యోతిక చేస్తూ.. అందరినీ ఫిదా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్‌ కూడా ఆశ్చర్యపోతున్నారు. సూర్యతో సమానంగా జ్యోతిక చేస్తున్న కసరత్తులు చూసి మెస్మరైజ్‌ అవుతున్నారు. మరికొందరు  మాత్రం ఇద్దరూ గెలిచారంటూనే పర్ఫెక్ట్‌ కపుల్స్‌ అని చెప్పుకొస్తున్నారు.

జ్యోతిక ఒకప్పటి దక్షిణాది అగ్ర తార.. అయితే చాలా కాలం తర్వాత  సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో  వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతూ, ఆకట్టుకునే అందంతో ఏమాత్రం తగ్గేది లేదంటోందీ ఈ బ్యూటీ. ఈ మధ్య కాలంలో లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అందరినీ మెప్పిస్తుంది. తాజాగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ సైతాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చి హిట్‌ కొట్టింది.

ఇన్నేళ్లైనా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. చక్కగా నాజుగ్గా ఉండటమే కాకుండా మంచి ఫిట్‌నెస్‌గా ఉండటానికి కారణం ఏంటి అంటే రన్నింగ్‌కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడమే జ్యోతిక ఫిట్‌నెస్‌ సీక్రెట్ అంట. నిత్యం జిమ్‌కు వెళ్లి వెయిట్ లిఫ్టింగ్, రోప్ ట్రైనింగ్ వంటివి చేస్తూ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటుందట. ఈ విషయంలో సూర్య కూడా జ్యోతికనే ఫాలో అవుతాడట.

Advertisement
 
Advertisement