సూర్య సినిమా 200 దేశాల్లో విడుద‌ల‌ | Suriya Movie Soorarai Pottru Will Stream In 200 Countries | Sakshi
Sakshi News home page

200 దేశాల్లో సూర్య సినిమా స్ట్రీమింగ్‌

Aug 27 2020 7:42 PM | Updated on Aug 27 2020 7:42 PM

Suriya Movie Soorarai Pottru Will Stream In 200 Countries - Sakshi

త‌మిళ స్టార్ హీరో సూర్య న‌టించిన తాజా చిత్రం "సూరరై పొట్రు". లేడీ డైరెక్ట‌ర్‌ సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో అప‌ర్ణ బాల‌ముర‌ళి హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో "ఆకాశం నీ హ‌ద్దురా" అనే టైటిల్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా థియేట‌ర్లు ఇంకా ఓపెన్ కాక‌పోవ‌డంతో చిన్న, మ‌ధ్య త‌ర‌హా సినిమాలు ఓటీటీని ఆశ్ర‌యిస్తున్న విష‌యం తెలిసిందే. కానీ భారీ సినిమాల నిర్మాత‌లు మాత్రం ఆ సాహ‌సం చేయ‌డానికి వెనుకాడుతున్నారు. పైగా త‌మిళ ఎగ్జిబిట‌ర్లు సినిమాలను నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయ‌డాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. (తనను వ్యభిచారిగా చిత్రీకరించి..)

అయిన‌ప్ప‌టికీ సూర్య మాత్రం ఓటీటీకే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. దీంతో భారీ రేటుకు అమెజాన్ ప్రైమ్ వాళ్లు సూర్య సినిమాను సొంతం చేసుకున్నారు. దీన్ని ఏకంగా 200 దేశాల్లో హాలీవుడ్ రేంజ్‌లో విడుద‌ల చేస్తున్నారు. ఈ విష‌యాన్ని సూర‌రై పొట్రు సినిమా నిర్మాణ సంస్థ 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ స‌హ నిర్మాత‌ రాజ‌శేఖ‌ర్ పాండియ‌న్ ధృవీక‌రించారు. ఎంతైనా ఓ ప్రాంతీయ సినిమాను ఇలా ఎక్కువ‌ దేశాల్లోకి అందుబాటులోకి తేవ‌డం నిజంగా ప్ర‌త్యేక‌మే. ఈ చిత్రం అక్టోబ‌ర్‌ 30న విడుద‌ల కానుంది. మ‌రోవైపు ఈ సినిమా నుంచి గ‌త నెల‌లో విడుద‌లైన కాట్టి పయ‌లే(కాటుక క‌నులే మెరిసిపోయే) పాట‌ను 15 మిలియ‌న్ల మంది వీక్షించారు. (కాటుక కనులే మెరిసిపోయే..)

Advertisement
 
Advertisement
Advertisement