Surekha Vani Daughter Supritha Buys New Luxury Car Pics Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Surekha Vani: కొత్త కారు కొన్న సురేఖవాణి కూతురు.. ఫోటోలు వైరల్‌

Apr 7 2023 4:56 PM | Updated on Apr 7 2023 5:44 PM

Surekha Vani Daughter Supritha Buys New Luxury Car Pics Goes Viral - Sakshi

నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పాపులర్‌ అయిన ఆమె ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది. చేతిలో సినిమా ఆఫర్లు లేకపోయినా సోషల్‌ మీడియాలో మాత్రం నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటుంది.

వయసు పెరుగుతున్నా మరింత గ్లామర్‌గా తయారవుతున్న సురేఖవాణి కూతురు సుప్రీతతో నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. పొట్టిపొట్టి బట్టలతో గ్లామర్‌ ఫోటోలను తరచూ షేర్‌ చేస్తుంటారు. పార్టీలు, పబ్స్‌, వెకేషన్స్‌కు అంటూ తల్లీకూతుళ్లు కలిసే తిరుగుగూ సోషల్‌ మీడియాలో హంగామా చేస్తుంటారు.

తాజాగా సురేఖవాణి కూతురు సుప్రీత కొత్త కారు కొనేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్‌చేస్తూ.. మంచి విషయాలు జరగడానికి కొంచెం టైం పడుతుంది అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక సుప్రీతకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement