
Superstar Rajinikanth Discharged From Hospital: ప్రముఖ నటుడు రజనీకాంత్ ఆదివారం రాత్రి కావేరి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అక్టోబరు 28(గురువారం) సాయంత్రం చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో ఆయన చేరారు. సాధారణ వైద్య పరీక్షల కోసమేనని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
అయితే రజనీకాంత్ మెదడులోని రక్తనాళాల్లో కొన్ని బ్లాక్స్ గుర్తించి చికిత్స చేసినట్లు చెన్నైలోని కావేరి ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమని రజనీకి వైద్యులు సూచించారు. ఆదివారం రాత్రి రజనీకాంత్ ఇంటికి చేరుకోవడంతో ఆయన ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు.