Rajinikanth Annaatthe First Look Released: పంచెకట్టులో తలైవా లుక్‌ అదుర్స్‌ - Sakshi
Sakshi News home page

Rajinikanth Annaatthe: థియేటర్‌ దద్దరిల్లేలా.. అన్నాత్తెలో రజనీ మోషన్‌ పోస్టర్‌

Sep 10 2021 1:15 PM | Updated on Sep 12 2021 12:48 PM

Superstar Rajinikanth Annaatthe First Look Released - Sakshi

అన్నయ్య బైక్‌ ఎక్కారు. ఒక చేతిలో బైక్‌ హ్యాండిల్‌ బార్, ఇంకో చేతిలో కత్తి... విలన్లను చెడుగుడు ఆడటానికే వెళుతున్నారని అర్థం అవుతోంది. ‘అన్నాత్తే’లోని రజనీకాంత్‌ తాజా స్టిల్‌ ఇది. అన్నాత్తే అంటే పెద్దన్నయ్య అని అర్థం.

శివ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం మోషన్‌ పోస్టర్, లుక్స్‌ విడుదలయ్యాయి. ‘థియేటర్‌ దద్దరిల్లేలా..’ అంటూ ఈ రెండింటినీ రిలీజ్‌ చేశారు. రజనీ స్టయిలిష్‌ లుక్స్‌ని చూసి ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. నయనతార, కీర్తీ సురేష్, ఖుష్బూ, మీనా తదితరులు నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్‌ 4న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement