Mosagallaku Mosagadu : సూపర్‌ స్టార్‌ కృష్ణ తొలి కౌబాయ్‌ చిత్రం​ 'మోసగాళ్లకు మోసగాడు'.. రీరిలీజ్‌

Superstar Krishna Mosagallaku Mosagadu Movie Re Release On May 31st - Sakshi

వెండితెరపై సూపర్‌ స్టార్‌ కృష్ణ చేసిన ప్రయోగాల గురించి చెప్పనక్కర్లేదు. తెలుగు తెరకు ఎన్నో సాంకేతిక హంగులను పరిచయం చేసిన కృష్ణ నటించిన తొలి కౌబాయ్‌ చిత్రం​ మోసగాళ్లకు మోసగాడు. 52 ఏళ్ల కిందట రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌ క్రియేట్ చేసింది.పద్మాలయా స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆ సినిమా కల్ట్‌ క్లాసిక్‌గా నిలిచిపోయింది.

చదవండి: ట్యాక్సీ డ్రైవర్‌గా చిరంజీవి.. అదిరిపోయిన 'భోళా శంకర్‌' పోస్టర్‌

ఇప్పుడీ చిత్రం రీరిలీజ్‌కు సిద్ధమైంది. మే31న సూపర్‌ స్టార్‌ కృష్ణ బర్త్‌డే సందర్భంగా 4k టెక్నాలజీతో సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఆది శేషగిరిరావు ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..''పద్మాలయ సంస్థకు ఫౌండేషన్ మోసగాళ్లకు మోసగాడు. మా బ్యానర్‌లో ఎన్ని సినిమాలు వవచ్చినా ఈ సినిమా చాలా ప్రత్యేకం. కృష్ణ గారి బర్త్‌డేకి నివాళిగా, అభిమానుల కోరిక మేరకు సినిమాను రీరిలీజ్‌ చేస్తున్నాం.

బర్త్‌డే రోజున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు(సోమవారం)అ‍ల్లూరి సీతారామరాజు రిలీజ్‌ అయ్యి 48 సంవత్సరాలు కావడంతో ఈరోజున ప్రెస్‌మీట్‌ పెట్టాము. కృష్ణ గారి మెమోరియల్‌గా మ్యూజియం కట్టడానికి ఇక్కడ ప్రభుత్వం స్థలం కేటాయిస్తామన్నారు. అయితే ఇక్కడే ఉన్న మా సొంత స్థలంలో పనులు చేయిస్తున్నాము'' అని ఆది శేషగిరిరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ్, బి గోపాల్, అశ్వినిదత్, నిర్మాత రామలింగేశ్వర రావు తదితరులు  పాల్గొన్నారు. చదవండి: కానిస్టేబుల్‌ పరీక్షలో బలగం ప్రశ్న, దిల్‌ ఖుష్‌ అయిన డైరెక్టర్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top