ఆ రూపంలో ఇంకా జీవించే ఉన్నారు.. మంజల ఘట్టమనేని ఎమోషనల్ ట్వీట్ | Sakshi
Sakshi News home page

Manjula Ghattamaneni: నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం నాన్న... మంజల ఘట్టమనేని ఎమోషనల్

Published Sun, Nov 27 2022 6:45 PM

Superstar Krishna Daughter Manjula Ghattamaneni Emotional Tweet - Sakshi

సూపర్‌ స్టార్ కృష్ణ మరణం వారి కుటుంబంతో పాటు అభిమానుల్లో విషాదాన్ని నింపింది. ఇవాళ ఆ నటశేఖరుని పెద్ద కర్మ కార్యక్రమం హైదరాబాద్‌లోని జేఆర్సీ, ఎన్‌ కన్వెన్షన్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ కుటుంబసభ్యులతో పాటు వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల ఘట్టమనేని నాన్నను గుర్తు చేసుకున్నారు.

(చదవండి: నాన్న ఎన్నో ఇచ్చారు.. వాటిలో నాకు అదే గొప్పది : మహేశ్‌ బాబు)

కృష్ణను తలుచుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ట్వీట్‌లో రాస్తూ.. 'మీరు మమ్మల్ని వదిలివెళ్లినా.. మీరు ఇచ్చిన గొప్ప వారసత్వం రూపంలో ఇంకా జీవించే ఉన్నారు. మేము ఎప్పటికీ ప్రేమిస్తునే ఉంటాం నాన్నా' అంటూ పోస్ట్ చేశారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు రెండు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు తరలివచ్చారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement