సూపర్‌ స్టార్‌ కృష్ణ ఫ్యాన్స్‌ కోసం ఈ పాట..

Super Star Krishna Birthday R P Patnaik Dedicates A Song For His Fans - Sakshi

సూపర్‌ స్టార్‌ కృష్ణ పుట్టినరోజు నేడు (మే 31). దాదాపు ప్రతి ఏడాది కృష్ణ జన్మదిన కానుకగా మహేశ్‌బాబు సినిమా నుంచి ఏదో ఒక అప్‌డేట్‌ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సంవత్సరం కరోనా సెకండ్‌ వేవ్‌ దృష్ట్యా మహేశ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ నుంచి అప్‌డేట్‌ రావడం లేదు. అయితే ఫ్యాన్స్‌కి ఓ కానుక సిద్ధమైంది. కృష్ణ చేసిన అద్భుత పాత్రల్లో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర ఒకటి. ఆయన పుట్టినరోజు సందర్భంగా సంగీత దర్శకుడు ఆర్‌.పి పట్నాయక్‌ పాడిన విప్లవ గీతాన్ని కృష్ణ అభిమానులకు అంకితమిస్తూ, ‘ఊర్వశి’ ఓటీటీ వారు విడుదల చేస్తున్నారు.

దర్శకుడు వీరు.కె ఈ పాట రూపకల్పనకు సారధ్యం వహించారు. ఆర్‌.పి పట్నాయక్, మౌనిక పాడారు. ఈ సందర్భంగా ‘ఊర్వశి’ ఓటీటీ ఎమ్‌.డి రవి కనగాల, సీఈఓ రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమడింపజేసిన కృష్ణగారిపై ఓ పాటను ఆయన బర్త్‌డే కానుకగా ఆయన అభిమానులకు అంకితం చేస్తూ, విడుదల చేయడం గర్వంగా ఉంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) అధ్యక్షుడు నరేష్‌కి థ్యాంక్స్‌’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top