భర్త మోసం.. వీడియో పోస్ట్ చేసిన సన్నీ!

Sunny Leone Husband Cheating Instagram Video - Sakshi

సన్నీ లియోన పేరు చెప్పగానే మీలో చాలామంది అలెర్ట్ అయిపోతారు. ఆమె గతం ఏంటనేది పక్కనబెడితే నటిగా పాన్ ఇండియా స్టార్‌డమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ముగ్గురు పిల్లలలో కలిసి ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది. మరోవైపు పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు ఓ విషయంలో భర్త తనని మోసం చేశాడని చెబుతూ వీడియో పోస్ట్ చేసింది. 

(ఇదీ చదవండి: వైద్యం కోసం విదేశాలకు సమంత.. అతడు ఎమోషనల్!)

శృంగార తారగా చాలా క్రేజ్ తెచ్చుకున్న సన్నీ లియోన్.. భారత మూలాలున్న అమెరికన్ నటి. కెనడాలోని ఓ సిక్కు కుటుంబంలో ఈమె పుట్టింది. 2012లో 'జిస్మ్ 2'తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రెండేళ్ల తర్వాత 'కరెంట్ తీగ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ఆ తర్వాత గరుడవేగ మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. చివరగా మంచు విష్ణు 'జిన్నా' సినిమాలో కనిపించింది.

ఈ మధ్యే భర్తతో కలిసి మాల్దీవులు టూర్ కి వెళ్లిన సన్నీ లియోన్.. దాని తర్వాత ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఫిల్మ్ ఫెస్టివల్‌కి వెళ్లింది. ప్రస్తుతం భర్త డేనియల్ వెబర్ తో కలిసి దుబాయి వెకేషన్‌లో ఉంది. ఈ క్రమంలోనే రూమ్ లో భర్త దొంగచాటుగా ఐస్ క్రీమ్ తినడాన్ని సన్నీ చూసేసింది. ఈ మొత‍్తాన్ని వీడియోగా తీసి, ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీనికే 'నా భర్త నన్ను మోసం చేస్తున్నప్పుడు' అనే క్యాప్షన్ పెట్టుకొచ్చింది.

(ఇదీ చదవండి: 'బేబి' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప‍్పుడే!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top