రెండేళ్లు కష్టపడి ఈ సినిమా పూర్తి చేశాం | Sundarangudu Movie Trailer Launch | Sakshi
Sakshi News home page

Sundarangudu: రెండేళ్లు కష్టపడి ఈ సినిమా పూర్తి చేశాం

Jan 27 2022 9:10 AM | Updated on Jan 27 2022 9:17 AM

Sundarangudu Movie Trailer Launch - Sakshi

నేను, చంద్ర గౌడ్‌గారు రెండేళ్లు కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశాం. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. మా ‘కృష్ణ సాయి చారిట బుల్‌ ట్రస్ట్‌’ తరఫున చాలామందికి సాయం చేస్తున్నాం

కృష్ణ సాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి హీరో హీరోయిన్లుగా దర్శకుడు వినయ్‌బాబు తెరకెక్కించిన చిత్రం ‘సుందరాంగుడు’. ఏవీ సుబ్బారావు సమర్పణలో చందర్‌ గౌడ్, యం.యస్‌.కె. రాజు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ‘సుందరాంగుడు’ ట్రైలర్‌ని విడుదల చేశారు.

కృష్ణ సాయి మాట్లాడుతూ– ‘‘నేను, చంద్ర గౌడ్‌గారు రెండేళ్లు కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశాం. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. మా ‘కృష్ణ సాయి చారిట బుల్‌ ట్రస్ట్‌’ తరఫున చాలామందికి సాయం చేస్తున్నాం. ఈ చిత్రం ద్వారా వచ్చే డబ్బుని ట్రస్ట్‌ కోసమే ఖర్చు చేయాలనుకుంటున్నాం. అయితే మా సినిమాకి థియేటర్స్‌ దొరికినా వాటి రెంట్, క్యూబ్స్‌కు డబ్బు కట్టడానికి ఇబ్బందిగా ఉంది. నాలాంటివాళ్లు చేసిన చిన్న సినిమాల విడుదలకు పరిశ్రమ పెద్దలు సపోర్ట్‌ చేయాలి’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement