
సాయి చరణ్, పల్లవి, ట్రాన్సీ హీరో హీరోయిన్లుగా జీయల్‌బీ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఐక్యూ’ (పవర్ ఆఫ్ స్టూడెంట్స్). కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన ఈ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది.
(చదవండి: శివలా ‘కస్టడీ’ గుర్తుండిపోతుంది : శ్రీనివాసా చిట్టూరి)
ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో నటుడు సుమన్ మాట్లాడుతూ– ‘‘రెగ్యులర్ కథలకు భిన్నంగా కొత్త కథలను ఎంచుకుని ‘ఐక్యూ’ లాంటి సినిమా తీసిన నిర్మాతలకు మనం అండగా ఉండాలి’’ అన్నారు. ‘‘యువత నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు కాయగూరల లక్ష్మీపతి. ‘‘మేధస్సుకు సంబంధించిన చిత్రం ఇది’’ అన్నారు జీయల్‌బీ శ్రీనివాస్.