'బలమెవ్వడు'లో పవర్‌ఫుల్‌ పాత్రలో సుహాసినీ | Suhasini Maniratnam Playing Key Role In Balamevvadu Movie | Sakshi
Sakshi News home page

Suhasini: మెడికల్‌ మాఫియాపై పోరాటం చేయనున్న సుహాసినీ

Jul 19 2021 4:45 PM | Updated on Jul 19 2021 4:45 PM

Suhasini Maniratnam Playing Key Role In Balamevvadu Movie - Sakshi

దశాబ్దాలుగా  తెలుగు, తమిళ చిత్రాల్లో తన అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయంలో స్థానం సంపాదించుకున్నారు సుహసినీ. తెలుగు ప్రేక్షకులకు సుహసినీ అంటే ప్రత్యేక అభిమానం. వాళ్ల అభిమానాన్ని కాపాడుకునేలా గొప్ప క్యారెక్టర్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు సుహసినీ. గతంలో 'రాఖీ' చిత్రంలో ఆమె పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రకు ఎంత పేరొచ్చిందో మనందరికీ తెలిసిందే. ఈసారి మరో పవర్ ఫుల్ పాత్ర ద్వారా మన ముందుకు రాబోతున్నారు. "బలమెవ్వడు" సినిమాలో డాక్టర్ యశోద పాత్రలో నటిస్తున్నారు సుహసినీ. మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడే నిజాయితీ గల వైద్యురాలి పాత్రలో సుహసినీ జీవించనున్నట్లు తెలుస్తోంది.

ధృవన్ కటకం, నియా త్రిపాఠీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న "బలమెవ్వడు" సినిమా వైద్యరంగంలోని దోపిడీని ప్రశ్నించబోతోంది. సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌బీ మార్కండేయులు నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన "బలమెవ్వడు" కాన్సెప్ట్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోందని చిత్రయూనిట్‌ పేర్కొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement