Sudigali Sudheer Engagement Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Sudigaali Sudheer: ఘనంగా సుడిగాలి సుధీర్‌ నిశ్చితార్థ వేడుక, ఇందులో నిజమెంతంటే?

Mar 3 2022 2:31 PM | Updated on Mar 3 2022 3:28 PM

Sudigali Sudheer Engagement Pics Goes Viral - Sakshi

బుల్లితెర స్టార్‌కు ఎంగేజ్‌మెంట్‌ జరిగిందంటూ తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఆ అమ్మాయి ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిలా కనిపిస్తోంది. ఒకవేళ నిజంగానే సుధీర్‌ తన ప్రేయసిని పరిచయం చేసి ఉండొచ్చేమో! అంటున్నారు.

సుడిగాలి సుధీర్‌.. బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. కామెడీ షోలు చేస్తూనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడీ కమెడియన్‌. తనకు వచ్చిన గుర్తింపు, ఆదరణతో సినిమాల్లోనూ లక్‌ పరీక్షించుకోవాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే కొన్ని సినిమాలు చేసి వెండితెర ప్రేక్షకులను సైతం మెప్పించాడు.

ఇదిలా ఉంటే ఈ బుల్లితెర స్టార్‌కు ఎంగేజ్‌మెంట్‌ జరిగిందంటూ తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. నిజంగానే ఓ కామెడీ షోలో సుధీర్‌కు ఎంగేజ్‌మెంట్‌ జరిపించారు. దీంతో అయోమయానికి లోనైన కొందరు అభిమానులు సుధీర్‌ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నాడా? అని చర్చలు మొదలు పెట్టారు.

గతంలో సుధీర్‌కు నిశ్చితార్థమేంటి? ఏకంగా పెళ్లి కూడా చేశారు. కాకపోతే అదంతా స్కిట్‌లో భాగంగానే! దీంతో ఈ ఎంగేజ్‌మెంట్‌ కూడా కచ్చితంగా ప్రాంక్‌ అయ్యుంటుందని అభిప్రాయపడుతున్నారు మెజారిటీ నెటిజన్లు. ఇలా చాలాసార్లు మోసపోయాం, కానీ ఈసారి ఆ ఛాన్స్‌ మీకు ఇవ్వమని తేల్చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం.. 'ఆ అమ్మాయి ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిలా కనిపిస్తోంది. ఒకవేళ నిజంగానే సుధీర్‌ తన ప్రేయసిని పరిచయం చేసి ఉండొచ్చేమో!' అంటున్నారు. మరి ఇదెంతవరకు నిజమో తెలియాల్సి ఉంది!

Advertisement
 
Advertisement
Advertisement