సూర్య మూవీ వాయిదా.. విక్రమ్‌ కొడుకుతో సుధాకొంగర కొత్త చిత్రం! | Sudha Kongara Plans Film With Vikram's Son Dhruv Vikram | Sakshi
Sakshi News home page

సూర్య మూవీ వాయిదా.. విక్రమ్‌ కొడుకుతో సుధాకొంగర కొత్త చిత్రం!

Published Sat, Apr 27 2024 12:28 PM | Last Updated on Sat, Apr 27 2024 12:28 PM

Sudha Kongara Plans Film With Vikram's Son Dhruv Vikram

తమిళసినిమా: నటుడు విక్రమ్‌ వారసుడు ధ్రువ్‌ విక్రమ్‌ హీరోగా సుధాకొంగర చిత్రం చేయబోతున్నారా? అన్న ప్రశ్నకు కోలీవుడ్‌ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. 2010లో దర్శకురాలిగా మెగాఫోన్‌ పట్టిన సుధా కొంగర, 2016లో మాధవన్‌ హీరోగా తెరకెక్కించిన ఇరుదు చుట్రు చిత్రంతో సంచలన విజయాన్ని సాధించారు. ఆ చిత్రం ద్వారా బాలీవుడ్‌ రియల్‌ బాక్సర్‌ రిత్వికాసింగ్‌ను కథానాయకిగా పరిచయం చేశారు. ఆ తరువాత అదే చిత్రాన్ని తెలుగులోనూ వెంకటేశ్‌ హీరోగా రీమేక్‌ చేశారు. కాగా 2022లో సూర్య కథానాయకుడిగా సూరరై పోట్రు చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం సూపర్‌హిట్‌ అయ్యింది.

ప్రస్తుతం అదే చిత్రాన్ని హిందీలో అక్షయ్‌కుమార్‌ హీరోగా   రీమేక్‌ చేస్తున్నారు. కాగా తదుపరి మరోసారి సూర్య హీరోగా పురనానూరు పేరుతో చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి మరింత సమయం అవసరం కావడంతో వాయిదా వేసినట్లు, నటుడు సూర్య, దర్శకురాలు సుధాకొంగర సంయుక్తంగా ఓ ప్రకటనను ఇటీవల మీడియాకు విడుదల చేశారు. దీంతో సూర్య, దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో  నటుడు ధ్రువ్‌ విక్రమ్‌ హీరోగా సుధాకొంగర చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. దీనికి జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతాన్ని అందించనున్నట్లు టాక్‌. అయితే ఇది ఏ బ్యానర్‌లో రూపొందనుంది? ఎప్పుడు ప్రారంభం అవుతుందీ? వంటి వివరాలు తెలియా ల్సి ఉంది. కాగా ప్రస్తుతం నటుడు ధ్రువ్‌ విక్రమ్‌ మారిసెల్వరాజ్‌ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీన్ని దర్శకుడు పా.రంజిత్‌ తన నీలం ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement