మిస్టీరియస్‌ డ్రామా | The story of the movie V will be a mystery in new way | Sakshi
Sakshi News home page

మిస్టీరియస్‌ డ్రామా

Jul 24 2023 12:52 AM | Updated on Jul 24 2023 12:52 AM

The story of the movie V will be a mystery in new way - Sakshi

అభిలాష్, రమ్య,ప్రాచీ ఠాకూర్, శివకోన, ప్రభాకర్, నేహా దేశ్‌΄పాండే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాజుగారి కోడిపులావ్‌’. కుటుంబ కథా ‘వి’ చిత్రం అనేది ట్యాగ్‌లైన్ . శివ కోన దర్శకత్వంలో అనిల్‌ మోదుగ, శివకోన నిర్మించిన ఈ సినిమాను ఆగస్టు 4న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్రయూనిట్‌ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అభిలాష్‌ మాట్లాడుతూ– ‘‘రాజుగారి కోడిపులావ్‌’ రోటీన్  సినిమా కాదు.. కొత్తగా మిస్టీరియస్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు శివ. నటీనటులు కునాల్, నేహాదేశ్‌ పాండే, రమ్య,ప్రాచీ ఠాకూర్‌ మాట్లాడారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement