ఈ క్లిష్ట స‌మ‌యం నుంచి బ‌య‌ట‌ప‌డ‌తాం: మాన్య‌త | Stop Speculating The Stage Of His Illness Says Samjay Dutt Wife | Sakshi
Sakshi News home page

ఈ క్లిష్ట స‌మ‌యం నుంచి బ‌య‌ట‌ప‌డ‌తాం: మాన్య‌త

Aug 19 2020 10:56 AM | Updated on Aug 19 2020 11:59 AM

Stop Speculating The Stage Of His Illness Says Samjay Dutt Wife  - Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్ న‌టుడు సంజ‌య్‌ద‌త్‌ ఆరోగ్యంపై ఆయన భార్య మాన్యత దత్ ఒక ప్రకటన చేశారు.‌ త‌మ కుటుంబంపై చూపిస్తున్న ప్రేమ, మ‌ద్ద‌తుకు ఆ ప్రకటన ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. 'ఈ కఠిన సమయాన్ని దాటేందుకు మీ అందరి తోడు కావాలి. గతంలో కూడా ఎన్నో ఆపదల‌ నుంచి మా కుటుంబం బయపడింది. ఈ ఇబ్బందికర పరిస్థితిని కూడా దాటేస్తాం. సంజయ్‌అభిమానులందరికి నా విజ్ఞప్తి ఒక్కడే. దయచేసి పుకార్లను నమ్మకండి, వాటిని ప్రచారం చేయకండి. సంజ‌య్‌ ఆరోగ్యానికి సంబంధించి క్ర‌మం త‌ప్ప‌కుండా మీకు అప్‌డేట్ అందిస్తాం.

నా పిల్ల‌ల‌కు మాత్ర‌మే కాదు ..త‌ల్లిదండ్రులు చ‌నిపోయాక సంజ‌య్ కుటుంబం మొత్తానికి తండ్రిలా ఉన్నాడు. త‌న‌కి క్యాన్స‌ర్ అని తెలియ‌గానే మొత్తం కుటుంబం క‌దిలిపోయింది. అయితే మేం అందరం క‌లిసి పోరాడాల‌ని నిశ్చ‌యించుకున్నాం. ఈ క్లిష్ట స‌మ‌యాన్ని సానుకూల దృక్ప‌దంతో ఎదుర్కోవాల‌నుకుంటున్నాం. ఈ సుదీర్ఘ పోరాటంలో అభిమానుల ప్రార్థనలు, ఆశీర్వాదాలు కావాలి. మీ ప్రార్థ‌న‌లు, దేవుని ఆశిస్సుల‌తో ఈ క్లిష్ట స‌మ‌యం నుంచి బ‌య‌ట‌ప‌డ‌తాం' అని మాన్య‌త ఓ ప్రకటనలో పేర్కొన్నారు. (సంజయ్‌ ఎప్పుడూ పోరాట యోధుడే: మాన్యత దత్‌)

 అయితే త‌న ఆరోగ్య చికిత్స నిమిత్తం షూటింగ్ నుంచి కాస్త విరామం తీసుకుంటున్న‌ట్లు అభిమానుల‌కు తెలియ‌జేస్తూ సంజ‌య్ ద‌త్ ఓ పోస్టును విడుద‌ల చేశారు. దీంతో సంజ‌య్ ద‌త్ ఊపిరితిత్తుల క్యాన్స‌ర్‌తో భాద‌ప‌డ‌తున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ప‌లు వార్తలు వ‌చ్చాయి. సంజ‌య్ త్వ‌ర‌గా కోలుకొని మ‌రోసారి తెర‌మీద క‌నిపించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంజయ్‌ దత్‌ గతేడాది.. కళంక్‌, ప్రస్తానం, పానిపట్‌ చిత్రాలతో అలరించారు. తాజాగా  1991లో మహేశ్‌ బట్‌ దర్శకత్వంలో వచ్చిన హిట్‌ మూవీ సడక్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సడక్‌ 2లో నటిస్తున్నారు. ఆదిత్యారాయ్‌ కపూర్‌, ఆలియా భట్‌ ప్రధాన పాత్రలో.. పూజాభట్‌ కీలక పాత్ర పోషిస్తున్న‌ ఈ చిత్రానికి మహేశ్‌ భట్‌ దర్శకత్వం వహిస్తుండగా.. ఆయన సోదరుడు ముఖేశ్‌ భట్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. (క్యాన్సర్‌ శాపం)


 

Advertisement
 
Advertisement
Advertisement