తల్లికి దూరమైన కుమారుడు ఏమయ్యాడు?.. ఆసక్తి పెంచుతోన్న సీరియల్! | Sakshi
Sakshi News home page

Gunde Ninda Gudi Gantalu: తల్లీ, కుమారుల భావోద్వేగాలే 'గుండె నిండా గుడి గంటలు'

Published Fri, Sep 29 2023 4:07 PM

Star Maa New Serial Gunde Ninda Gudi Gantalu From October 2nd - Sakshi

అమ్మ అంటే దైవం. అమ్మ మన కళ్లు ముందు తిరిగే దేవత. అలాంటి అమ్మకి దూరమైన ఓ కొడుకు ఏమవుతాడు? అసలు ఎందుకు దూరమయ్యాడు? ఇదే "గుండె నిండా గుడిగంటలు" సీరియల్ కథ. విలక్షణమైన కథలతో ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ అందిస్తున్న స్టార్ మా ఈ సారి అమ్మ కథతో అలరించబోతోంది. 

తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న స్టార్ మా ఇప్పుడు మరిన్ని భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని అలరించబోతోంది. అనుబంధం ఎంత గొప్పదో ఈ కథ చెబుతుంది. కన్నీరు ఎంతగా తోడు నిలబడుతుందో ఈ పాత్రలు చెబుతాయి. ప్రేమను పంచడం అంటే ఎలా ఉంటుందో ఈ సీరియల్ సన్నివేశాలు చెబుతాయి. కఠినమైన మనసుని కరిగించే శక్తి ప్రేమకు మాత్రమే ఉంటుందని ఈ కథనం వివరిస్తుంది.  అక్టోబర్ 2 నుంచి  రాత్రి 9 గంటలకు ఈ సీరియల్ ప్రారంభం కాబోతోంది.

దారి తప్పిన జీవితాన్ని ఒక గాడిలో పెట్టాలనుకునే అమ్మాయి ప్రయత్నం.. ఆ తల్లికి, కుమారుడికి మధ్య దూరాన్ని తగ్గించాలనుకునే తాపత్రయం, తల్లీ, కొడుకుల మధ్య అనూహ్యమైన సంఘటనలతో ఈ సీరియల్ పూర్తిగా కొత్త భావోద్వేగాల్ని అందించబోతోంది. ఒక పసివాడు తల్లి కోసం ఎంత ఆరాట పడతాడో.. తల్లి ఒకసారి కనిపిస్తే బాగుండు అని ఎంతగా కోరుకున్నాడో.. అతని తరవాతి జీవితం ఎలా గడిచిందో తెలియాలంటే "గుండె నిండా గుడి గంటలు" చూడాల్సిందే.

Advertisement
Advertisement