నయా ట్రెండ్‌.. పాన్‌ ఇండియా సినిమాల్లో స్పెషల్‌ గెస్టులుగా స్టార్‌ హీరోలు!

Star Heroes Guest Appearance in Pan India Movies - Sakshi

పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనగానే సింగిల్ హీరో ఉండాల్సిన పనిలేదు. త్రిబుల్ ఆర్ తో రామ్, భీమ్ చేసిన, హంగామా అంతా ఇంతా కాదు. ఏకంగా ఆస్కార్ వరకు వెళ్లారు. అందుకే దేశంలో ఉన్న మిగతా దర్శకులు ఇలాంటి కాంబినేషన్స్ సెట్ చేసేందుకు, థియేటర్‌కు వచ్చే ఆడియన్స్‌కు విజువల్ ఫీస్ట్ అందించేందుకు సిద్ధమవుతున్నారు. జవాన్‌లోకి బన్నీని ఆహ్వానించడం ఈ ట్రెండ్‌లో భాగమే..

షారుఖ్ ఖాన్‌ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్‌ పఠాన్‌లో సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు. క్లైమాక్స్ పార్ట్‌లో ఇద్దరు ఖాన్స్‌లు కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఇదే ఫార్ములాను జవాన్‌కు అప్లై చేస్తానంటున్నాడు అట్లీ. అందుకోసం బన్నీని రంగంలోకి దిగమంటున్నాడు. నిజానికి ఈ రోల్ గతంలో విజయ్ దగ్గరికి వెళ్లింది. విజయ్ ఎందుకో ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఇప్పుడు బన్నీని అడుగుతున్నాడు అట్లీ.

స్టార్ హీరోల సినిమాల్లో మరో స్టార్ హీరో కొద్ది నిమిషాల పాటు కనిపించే ట్రెండ్ పాతదే! కాని ఇప్పుడు లేటెస్ట్‌గా, సరికొత్తగా తీసుకొస్తున్నారు దర్శకులు. సల్మాన్ ఖాన్ నటిస్తున్న కిసీ కా భాయ్ , కిసీ కా  జాన్ చిత్రంలోనూ రామ్ చరణ్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. వాల్తేరు వీరయ్య తర్వాత  చిరు నటిస్తున్న సినిమా భోళాశంకర్. ఈ మూవీలో ఒక పాటలో రామ్ చరణ్ కొన్ని నిమిషాలు కనిపించబోతున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ మేకింగ్‌లో ప్రభాస్ నటించే చిత్రంలో హృతిక్ రోషన్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. మొత్తంగా పాన్ ఇండియా మూవీస్‌ను ఈ గెస్ట్ అప్పీయరెన్సెస్ ట్రెండ్  నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్తుందని చెప్పవచ్చు.

చదవండి: గ్రాండ్‌గా రిలీజ్‌.. మొదటిరోజే వన్‌ ప్లస్‌ ఆఫర్‌.. మరీ ఇంత ఘోరమా?
సింపుల్‌గా ఉపాసన సీమంతం

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top