Vijay Bhaskar: చాలా గ్యాప్‌ తర్వాత మెగా ఫోన్‌ పడుతున్న స్టార్‌ డైరెక్టర్‌

Star Director Vijay Bhaskar Is Back After Decade Break - Sakshi

‘స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి’ లాంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల దర్శకుడు కె. విజయ్‌ భాస్కర్‌ కొంత విరామం తర్వాత మెగాఫోన్‌ పడుతున్నారు. ఆయన దర్శకత్వంలో రానున్న 13వ చిత్రాన్ని ఎస్‌ఆర్‌కే ఆర్ట్స్‌ ప్రొడక్షన్‌పై పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధింన నూతన కార్యాలయ ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది.

నటి, నిర్మాత జీవితా రాజశేఖర్, ‘కార్తికేయ’ నిర్మాత బొగ్గరం వెంకట శ్రీనివాస్, ప్రొడ్యూసర్‌ వంకాయలపాటి మురళీకృష్ణ పాల్గొని రామకృషకి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘విజయదశమి రోజున షూటింగ్‌ ప్రారంభిస్తాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు దసరా నాడే ప్రకటిస్తాం’’ అని రామకృష అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top