'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్‌లో ఆ రెండు రిలీజ్.. రాజమౌళి క్లారిటీ | Rajamouli To Reveal Mahesh Babu Film Title And Concept Video At Globe Trotter Event, Complete Details Inside | Sakshi
Sakshi News home page

SSMB29 Globe Trotter Event: ఫ్యాన్స్ సందేహాలకు ఎండ్ కార్డ్.. మూడు నిమిషాల వీడియో రిలీజ్

Nov 15 2025 3:39 PM | Updated on Nov 15 2025 4:25 PM

SSMB29 Globe Trotter Event Details Latest Update

రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో తీస్తున్న కొత్త సినిమా టైటిల్ ఏంటో మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది. హైదరాబాద్ వేదికగా ఈరోజు (నవంబరు 15) సాయంత్రం 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. 100 అడుగుల ఎత్తున్న ఎల్ఈడీ స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో అసలేం రిలీజ్ చేస్తారా అని అభిమానుల మదిలో బోలెడన్ని సందేహాలు. ఇప్పుడు వాటికి ఎండ్ కార్డ్ వేసిన రాజమౌళి.. ఒక్క ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చేశారు.

(ఇదీ చదవండి: మహేష్‌ బాబు కోసం 7వేల కిలోమీటర్లు దాటి వచ్చేశాడు)

గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో టైటిల్ రివీల్ చేయడంతో పాటు మూవీ థీమ్ ఏంటనేది వీడియో రూపంలో రిలీజ్ చేయబోతున్నట్లు రాజమౌళి చెప్పుకొచ్చారు. ఈవెంట్‌లో స్క్రీన్ పై ప్రసారమైన తర్వాత యూట్యూబ్‌లోనూ ఆ వీడియోని రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు. అయితే ఈ వీడియో దాదాపు మూడు నిమిషాల పాటు ఉండనుందని తెలుస్తోంది. ఇందులో అన్ని పాత్రలకు సంబంధించిన విజువల్స్, మూవీ స్టోరీ ఏంటనేది చూచాయిగా చూపించడం గ్యారంటీ.

ఇప్పటికే ఈ మూవీలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' లుక్, ప్రియాంక చోప్రా 'మందాకిని' లుక్స్ రిలీజ్ చేశారు. వీటిపై మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతానికి ఫ్యాన్స్ అందరూ కూడా మహేశ్ బాబు లుక్ కోసమే ఎదురుచూస్తున్నారు. మరి లుక్ రిలీజ్ చేస్తారా? నేరుగా వీడియోనే రిలీజ్ చేసి అభిమానులకు జక్కన్న కిక్ ఇస్తారా అనేది చూడాలి? ఇప్పటికే వారణాసి, రుద్ర అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. మరి దేన్ని ఫైనల్ చేశారో మరికొద్ది గంటల్లో తేలనుంది. 

(ఇదీ చదవండి: ఈరోజు మీగురించే ఎక్కువ ఆలోచిస్తున్నా: మహేశ్‌బాబు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement