రాజమౌళి (SS Rajamouli) సినిమా అంటే జనాల్లో క్రేజ్.. అందులోనూ సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu)తో సినిమా అంటే ఆ క్రేజ్ ఇంకే రేంజ్‌లో ఉంటుందో ఎవరి ఊహకూ అందదు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న #SSMB29 మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలో సినిమా టైటిల్, మహేశ్‌బాబు ఫస్ట్ లుక్ కొన్ని గంటల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకోసం గ్లోబ్ ట్రాటర్ అనే ఈవెంట్‌ను ఘనంగా ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కోసం పాస్‌పోర్ట్‌ల మాదిరిగా ఉండే పాస్‌లను జారీ చేశారు.
మీ గురించే ఆలోచిస్తున్నా..
దీంతో ఇండస్ట్రీలో పండగ వాతావరణం నెలకొంది. మరోవైపు నేడు (నవంబర్ 15న) మహేశ్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి. ఈ సందర్భంగా మహేశ్‌బాబు తండ్రిని గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. నాన్నా, ఈరోజు మీ గురించి కాస్త ఎక్కువగానే ఆలోచిస్తున్నా.. మీరుంటే చాలా గర్వపడేవారు అంటూ తండ్రితో దిగిన ఓ ఫోటోను పోస్ట్‌కు జత చేశాడు.
మరికాసేపట్లో టైటిల్ రివీల్
#SSMB29 సినిమా విషయానికి వస్తే మహేశ్‌బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ మూవీని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్, మందాకినిగా ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఇదివరకే వీరిద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. నేడు సాయంత్రం జరగబోయే గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో మహేశ్ ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు టైటిల్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కు వెళ్లలేనివారు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.


