SS Rajamouli -Mahesh Babu: మహేశ్ బాబుతో సినిమా.. జక్కన్న భారీ ప్లాన్!

SS Rajamouli Plans Workshop On His Next Movie With Mahesh Babu - Sakshi

ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళి అనుకున్నది సాధించాడు...ఇక ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి తన నెక్ట్స్ మూవీపైనే ఫోకస్ పెట్టాడు. రాజమౌళి సినిమా ఏదైనా సెట్స్ పైకి వెళ్లే ముందే పక్కా ప్లానింగ్‌తో రెడీ అవుతాడు. ఓ సినిమా అనుకున్న తర్వాత ఏ స్టేజ్‌లో కూడా కాంప్రమైజ్ కాడు. రాజమౌళితో సినిమా అంటే ఆషామాషీగా ఉండదు. ఏ స్టార్ హీరో అయినా, ఏ స్టార్ టెక్నిషీయన్ అయినా రాజమౌళి మాట వినాల్సిందే. ఇక రాజమౌళి నిర్వహించే వర్క్‌ షాప్‌కు అందరూ హాజరు కావాల్సిందే. 

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో జక్కన్న తెరకెక్కించబోయే తన నెక్ట్స్ మూవీకి వర్క్ షాప్ ప్లాన్ రెడీ చేశాడు. రాజమౌళితో సినిమా చేయడం హీరోలకు ఓ సవాల్ అనే చెప్పాలి. తన కథకు తగినట్లు హీరో ఉండే విధంగా రాజమౌళి శిక్షణ ఇప్పిస్తాడు. హీరో తన పాత్రకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్  మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే పాత్రను అర్థం చేసుకుని ఆ క్యారెక్టర్‌లోకి హీరో పరకాయ ప్రవేశం చేసేలా రాజమౌళి ట్రైనింగ్   ఉంటుంది. 

సాధారణంగా ఏ డైరెక్టర్ అయినా వర్క్ షాప్ వన్ వీక్ లేదా టెన్ డేస్ ఉండేలా ప్లాన్ చేస్తుంటారు. అయితే రాజమౌళి కొన్ని నెలల పాటు వర్క్ షాష్ నిర్వహిస్తాడు. అంతే కాదు  ఈ వర్క్ షాప్ కోసం బడ్జెట్ కూడా కేటాయిస్తాడు. ఇక ప్రిన్స్‌తో తెరకెక్కించబోయే #ఎస్ఎస్ఎంబీ 29 మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టనున్నాడట జక్కన్న. 

రాజమౌళి మగధీర సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ వరకు అన్ని సినిమాలకు వర్క్‌ షాప్ నిర్వహించాడు. తన ఊహలో ఆలోచనల్ని రాజమౌళి ముందుగా తన టీమ్‌కు చెబుతాడు. అలాగే వారు ఇచ్చే ఇన్ పుట్స్ కూడా తీసుకుంటాడు. ఇక ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కెమెరా, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా ప్రతి విభాగానికి తాను తీయబోయే సినిమాకి సంబంధించి అన్ని విషయాలు వివరిస్తాడు. తను ఏ సీన్ ఏలా తీయాలనుకుంటున్నది. అందుకు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ కోరుకుంటున్నాడో వివరిస్తాడు.  

అలాగే మహేశ్ బాబుతో తీయబోయే సినిమా కోసం  రాజమౌళి ఓ భారీ వర్క్ షాప్ ప్లాన్ చేశాడనే మాట టీ టౌన్‌లో వినిపిస్తోంది. గ్లోబల్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వేంచర్ జోనర్‌లో తెరకెక్కించబోయే ఈ సినిమాలో  వీఎఫ్‌ఎక్స్ ఎక్కడ అవసరం అవుతాయి.. ఏ సీన్స్‌కు గ్రీన్ మ్యాట్ వాడాలి. ఇక యాక్షన్‌ సన్నివేశాలకు సంబంధించిన శిక్షణ ఈ వర్క్ షాప్‌లో ఉండనుందని సమాచారం.

బాహుబలి, బాహుబలి- 2 సినిమాల కోసం రాజమౌళి  కొన్ని నెలల పాటు  ప్రభాస్ - రానా, అనుష్క, నాజర్, సత్యప్రకాశ్‌లకు వర్క్ షాపులు నిర్వహించాడు. ఇక ప్రభాస్, రానాలో రాజరికం ఉట్టిపడేలా వాళ్లిద్దర్నీ ఆయన తీర్చిదిద్దారు. అలాగే మేకోవర్ విషయంలో  ప్రభాస్ - రానా ఇద్దరూ చాలా కష్టపడ్డారు. అంతే కాదు ఓ రేంజ్‌లో రానా, ప్రభాస్ జిమ్‌లో కసరత్తులు చేసి కండలు పెంచారు. ఇక ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా రాజమౌళి రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌ను కూడా  వదిలిపెట్టలేదు. 

ఇక ఇప్పుడు పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించబోయే మహేశ్ బాబు సినిమా కోసం... ఆరు నెలల వర్క్ షాప్ ప్లాన్ చేశాడట రాజమౌళి. ఈ మూవీ నెక్ట్స్‌ సమ్మర్‌లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ వుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ సినిమా వర్క్ షాప్ స్టార్ట్ అవుతుందనే ప్రచారం ఫిల్మ్‌ సర్కిల్స్‌లో సాగుతోంది. ఈ వర్క్ షాప్‌లో మహేష్ బాబుతో సహా మిగిలిన యాక్టర్స్ అందరికీ ట్రైయినింగ్ ఉంటుందట. కాగా.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న మహేశ్ బాబు మూవీ  ఎస్ఎస్ఎంబీ 28 ఆగస్టు 11న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top