‘వారణాసి’ కోసం కొత్త భాష.. జక్కన్న మరో ప్రయోగం! | SS Rajamouli Creates New Language For Varanasi Movie | Sakshi
Sakshi News home page

‘వారణాసి’ కోసం కొత్త భాష.. జక్కన్న మరో ప్రయోగం!

Oct 8 2026 5:24 PM | Updated on Oct 8 2026 6:01 PM

SS Rajamouli Creates New Language For Varanasi Movie

దర్శకధీరుడు రాజమౌళి నుంచి  సినిమా వస్తుందంటేనే ఏదో ఒక కొత్తదనం ఉంటుందనే అంచనాలు ఉంటాయి. కథ రొటీన్‌గా అనిపించినా.. తనదైన మేకింగ్‌తో దాన్ని కొత్తగా ఆవిష్కరించడం రాజమౌళి స్టైల్‌. అంతేకాదు.. తన కథలకు తగ్గట్టుగా కొత్త ప్రపంచాలను, కొత్త భాషలను సృష్టించడంలోనూ ఆయనది ప్రత్యేకమైన శైలి. ‘బాహుబలి’లో కిలికిలి భాషతో ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేసిన జక్కన్న.. ఇప్పుడు ‘వారణాసి’ కోసం కూడా మరో కొత్త భాషను పరిచయం చేయబోతున్నాడట. 

(ఇదీ చదవండి: ఇండియన్‌-2 డిజాస్టర్‌.. పార్ట్‌-3పై ఊహించని నిర్ణయం..!)

సినిమాలోని టైమ్‌ ట్రావెల్‌ ఎపిసోడ్‌లో భాగంగా హీరో మహేశ్‌ బాబు ఓ గుహలోకి ప్రవేశిస్తాడట. అక్కడ గోడలపై ఎవరీకి తెలియని ఓ కొత్త లిపితో రాతలు ఉంటాయట. వాటిని డీకోడ్‌ చేసి..అందులో దాగిఉన్న రహస్యాలను ఛేదించడం కథలో చాలా కీలకమైన అంశంగా మారుతున్నట్లు సమాచారం. దీని కోసం రాజమౌళి ప్రత్యేకంగా ఓ కొత్త భాషని క్రియేట్‌ చేయాలని ఫిక్స్‌ అయ్యారట. భాషా నిపుణులను రంగంలోకి దింపి కొత్త భాష, లిపిని రెడీ చేయిస్తున్నారట. ‘బాహుబలి’లో కిలికిలికి భాష ఎంత ఫేమస్‌ అయిందో..అంతకు మించేలా వారణాసిలో కొత్త లాంగ్వేజ్‌ ఉండబోతున్నట్లు సమాచారం.  

(ఇదీ చదవండి: ఏఐతో అసభ్యక పోస్టులు.. కోర్టుకెక్కిన నటి)

‘వారణాసి’ విషయానికొస్తే.. పాన్‌ వరల్డ్‌ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేశ్‌ బాబు..  రుద్ర, శ్రీరాముడిగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌ కుమార్‌ తదితరులు కీలక పాత్రల్లో ఎస్‌ఎస్‌ కార్తికేయ, కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్న ‘వారణాసి’ 2027 ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. దాదాపు 120 దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement