రాజమౌళిపై హనుమాన్‌ భక్తులు ఫైర్‌ | SS Rajamouli Comments On Lord Hanuman In Varanasi Movie Event | Sakshi
Sakshi News home page

రాజమౌళిపై హనుమాన్‌ భక్తులు ఫైర్‌

Nov 16 2025 11:38 AM | Updated on Nov 16 2025 11:50 AM

SS Rajamouli Comments On Lord Hanuman In Varanasi Movie Event

మహేష్‌ బాబు, రాజమౌళి సినిమా వారణాసి టైటిల్‌ గ్లింప్స్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. ఈ మూవీకి సంబంధించిన వీడియో క్లిప్‌ను అభిమానులకు చూపించాలని ఆయన చాలా కష్టపడ్డారు. ఈ వేడుకలో టైటిల్‌ గ్లింప్స్‌ ప్రదర్శన సాంకేతిక సమస్యల వల్ల కొద్ది సేపు ఆలస్యమైంది. దీంతో ఆయన హనుమంతుడిని నిందిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. వారణాసి గ్లింప్స్‌ కోసం ఇండియాలోనే అతి పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌ ఏర్పాటు చేశారు. అది పని చేయాలంటే దాదాపు 45 జనరేటర్లు రన్‌ కావాల్సి వుంటుంది. కానీ, తన ప్లాన్‌ ప్రకారం అది వర్కౌట్‌ కాకపోవడంతో రాజమౌళి అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన చేసిన  కామెంట్లపై నెటిజన్లతో పాటు హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మొదట కథా రచయిత విజయేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ..  వారణాసి కోసం మహేష్‌ చాలా కష్టపడ్డారని చెప్పారు. కొన్ని కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు. కొన్ని కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారని ఆయన అన్నారు. అనుక్షణం రాజమౌళి గుండెలపై హనుమ ఉన్నాడని విజయేంద్రప్రసాద్‌  చెప్పారు. అయితే,   వారణాసి గ్లింప్స్ రిలీజ్‌కు పదే పదే సాంకేతిక ఆటంకాలు ఎదుదు కావడంతో రాజమౌళి నిరాశ చెంది హనుమంతుడిపై ఇలా అన్నారు. 'నాకు దేవుడిపైన పెద్దగా నమ్మకం లేదు. హనుమంతుడు నా వెనుకాల ఉండి నడిపించారని మా నాన్న చెప్పారు. ఇలా అంటే నాకు వెంటనే కోపం వచ్చింది. ఆయన ఉంటే ఇదేనా నడిపించేది..?'  అని అసహనం వ్యక్తం చేశారు. 

దీంతో రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు హనుమంతుడి భక్తులతో పాటు హిందూ మనోభావాలను దెబ్బతీశాయని చర్చ తెరపైకి వచ్చింది. టెక్నికల్ టీమ్‌ వైఫల్యాన్ని కూడా దేవుడికి ఆపాదించడం ఏంటి అంటూ వారు భగ్గుమంటున్నారు. దేవుడిని నమ్మనంటూనే.. ఆటంకాలు వస్తే ఇలా  హనుమంతుడిపై నిందలు మోపడం ఎందుకు అంటూ ఫైర్‌ అవుతున్నారు.  సినిమా విజయం సాధించినప్పుడు ఆ  క్రెడిట్ మీ ఖాతాలో వేసుకుని.. విఫలమైతే దేవుడిది తప్పు అంటే ఎలా అని రాజమౌళిపై పోస్టులు పెడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement