Actress Sridevi: వేలానికి శ్రీదేవి చీరలు, ఆ డబ్బుతో ఏం చేయబోతున్నారంటే..

Sridevi Saree Auction Announcement in English Vinglish - Sakshi

అతిలోక సుందరి, దివంగ నటి శ్రీదేవి చీరలను వేలం వేస్తున్నారు.  ఆమె నటించిన ఇంగ్లిష్‌-వింగ్లిష్‌ చిత్రంలో శ్రీదేవి ధరించిన చీరలను వేలం వేసేందుకు చిత్ర బృందం ప్లాన్‌ చేస్తోంది. కాగా తనదైన అందం, నటనతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు ఆమె. 1980లో హీరోయిన్‌గా రాణించిన ఆమె పెళ్లి అనంతరం 1997లో నటనకు విరామం చెప్పారు.ఆ తర్వాత 2012లో ఇంగ్లిష్-వింగ్లిష్ చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 10న పదేళ్లు పూర్తి చేసుకుంటోంది.

చదవండి: ట్రెండింగ్‌లో బాయ్‌కాట్‌ ఆదిపురుష్‌.. ‘బాలీవుడ్‌ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తోంది’

ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు డైరెక్టర్ గౌరీ షిండే ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ 10వ వార్షికోత్సవం నిర్వహించడంతోపాటు, ఇంగ్లిష్ వింగ్లిష్‌లో శ్రీదేవి ధరించిన చీరలను వేలం వేయాలని అనుకుంటున్నట్టు గౌరీ షిండే ప్రకటించారు. వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని బాలికల విద్య కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థకు ఇవ్వనున్నారు. ఈ విషయాలను దర్శకురాలు గౌరీ షిండే ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు. ఇంగ్లిష్ వింగ్లిష్‌లో సగటు ఇల్లాలిగా, ఇంగ్లిష్ ప్రావీణ్యం లేని పాత్రలో శ్రీదేవి నటించి మెప్పించారు. అమెరికా వెళ్లిన ఆమె ఇంగ్లిష్‌ రాక అక్కడ ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఆ తర్వాత ఇంగ్లిష్‌లో ఎంతటి ప్రావీణ్యం పొందారనేదే కథ. 

చదవండి: దీపావళికి ఓటీటీలో ‘బింబిసార’ మూవీ, రిలీజ్‌ డేట్‌ ఇదే!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top