Bimbisara OTT Release: దీపావళికి ఓటీటీలో ‘బింబిసార’ మూవీ, రిలీజ్‌ డేట్‌ ఇదే!

Kalyan Ram Bimbisara OTT Streaming On This Diwali October 21st In ZEE5 - Sakshi

దాదాపు రెండేళ్ల గ్యాప్‌ అనంతరం నందమూరి హీరో కల్యాణ్‌ రామ్‌ నటించిన చిత్రం ‘బింబిసార’. రొటీన్‌ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్‌ ఉన్న కథతో వచ్చి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టేశాడు కల్యాణ్‌ రామ్‌. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్‌ 5న ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్సాఫీసుకు భారీ విజయం అందించింది. ఇక బాక్సాఫీస్ వద్ద బింబిసార మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసి డబుల్ ప్రాఫిట్‌ని ఖాతాలో వేసుకుంది. థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోయిన ఈచిత్రం ఇప్పుడు ఈమూవీ ఓటీటీలో సందడి చేయబోతోంది.

ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ డిజిటిల్‌  ప్లాట్‌ఫాం జీ5 సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా ఈ మూవీని జీ5 సంస్థ ఓటీటీకి తీసుకువస్తోంది. అక్టోబర్‌ 21న ఈ మూవీని ఓటీటీలో కానుంది. ఇందుకు సంబంధించి కీలక ప్రకటన కూడా వచ్చేసింది. కాగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై వశిష్ఠ్‌ దర్శకత్వంలో కె. హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. కేథరీన్‌, సంయుక్త మేనన్‌లు ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటించారు. ఇందులో కల్యాణ్‌ తన నటనలో విశ్వరూపం చూపించాడు. డ్యుయెల్‌ రోల్‌ చేసిన కల్యాణ్‌ రామ్‌ బింబిసారుడు అనే క్రూరమైన రాజు పాత్రలో తన నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top