Adipurush: ట్రెండింగ్‌లో బాయ్‌కాట్‌ ఆదిపురుష్‌.. ‘బాలీవుడ్‌ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తోంది’

Boycott Adipurush Trends on Twitter, Says Prabhas Film is Misrepresent Culture - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఆదిపురుష్‌ మూవీని వివాదాలు చుట్టుముడుతున్నాయి. భారీ అంచనాల మధ్య అక్టోబర్‌ 2న అయోధ్య వేదికగా ఆదిపురుష్‌ టీజర్‌ విడుదలైన సంగతి తెలిసిందే. మైథలాజికల్‌ చిత్రంగా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓంరౌత్‌ ఈ మూవీని త్రీడీలో తెరకెక్కించారు. అయితే ఈమూవీకి వీఎఫ్‌ఎక్స్‌, గ్రాఫిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు ఓం రౌత్‌. దీంతో 3డీలో రిలీజ్‌ చేసిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఆదిపురుష్‌ను విజువల్‌ వండర్‌ అంటూ కొందరు కొనియాడుతుండగా.. మరికొందరు పిల్లలు చూసే కార్టూన్‌ సినిమాలా ఉందంటూ ట్రోల్‌ చేస్తున్నారు. 
చదవండి: ‘ఆది పురుష్‌’ టీజర్‌పై ట్రోలింగ్‌.. స్పందించిన డైరెక్టర్‌ ఓంరౌత్‌

రామాయణం అని చెప్పి బొమ్మల సినిమా, గ్రాఫిక్స్ సినిమా తీశారేంటి అని తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రావణాసురుడు ఎలా ఉంటాడో తెలీదా, హనుమంతుడు ఎలా ఉంటాడో తెలీదా అంటూ హిందు సంఘాలు, బీజేపీ నాయకులు ఓంరౌత్‌పై మండిపడుతున్నారు. ఇప్పుడు ఏకంగా బాయ్‌కాట్‌ ఆదిపురుష్‌ అంటూ మూవీ టీంకు షాకిస్తున్నారు. ఆదిపురుష్‌ను బహిష్కరించాలంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు కొందరు నెటిజన్లు. బాయ్‌కాట్‌ ఆదిపురుష్‌, బ్యాన్‌ ఆదిపురుష్‌ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌లను వైరల్‌ చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ సినిమాల మీద తీవ్ర వ్యతిరేకత ఉన్న సంగతి తెలిసిందే. 

చదవండి: అలా జరిగి ఉంటే.. బాహుబలిలో రాజమాత పాత్ర నేను చేసేదాన్ని: జయచిత్ర

బాయ్‌కాట్ బాలీవుడ్ అంటూ గత కొన్ని రోజులుగా వ్యతిరేకత వస్తున్న సంగతి విదితమే. ఇదిలా ఉంటే హిందూ దేవుళ్లపై బాలీవుడ్‌లో సినిమాలు తెరకెక్కించి ప్రతిసారి అభ్యంతరాలు వస్తుంటాయి. తమ చిత్రాల్లో హిందు దేవుళ్లని, పురాణాలని, చరిత్రని బాలీవుడ్‌ వక్రీకరిస్తుందనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. ప్రతిసారి దేవుళ్లకి సంబంధించిన సినిమాలు తీయడం, హిందు మతవిశ్వాసాలను దెబ్బతీయడం బాలీవుడ్‌కు అలవాటు అయిందంటున్నాయి హిందు సంఘాలు. ఇప్పుడు ఆదిపురుష్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది అంటున్నారు. దీంతో మూవీ టీం మరింత ఆందోళనకు గురవుతోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top