Is Sreeleela Rejected Kollywood Offer? - Sakshi
Sakshi News home page

Sreeleela: చేతిలో అరడజను సినిమాలు... కోలీవుడ్‌ ఆఫర్‌ను రిజెక్ట్‌ చేసిన శ్రీలీల

Jun 9 2023 8:24 AM | Updated on Jun 9 2023 9:03 AM

Is Sreeleela Rejected Kollywood Offer? - Sakshi

ధమాకా వంటి చిత్రాలు హిట్‌ అవడంతో ఇప్పుడు అరడజనుకు పైగా చిత్రాలు చేతిలో ఉన్నాయి. లక్‌ అంటే ఈమెదే అన్నట్టుగా ఉంది పరిస్థితి.

ఒక భాషలో నటిస్తున్న హీరోయిన్లకు ఇతర భాషల్లో అవకాశం వస్తే ఎగిరి గంతేసి కథ కూడా వినకుండా నటించడానికి ఓకే చెప్పేస్తారు. ఇంకా చెప్పాలంటే అలాంటి అవకాశం కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు పాన్‌ఇండియా చిత్రాల నిర్మాణం అధికం అవుతుండడంతో హీరోలతో పాటు హీరోయిన్లు తమ స్థాయిని పెంచుకోవాలని తాపత్రయ పడటం సహజం. కానీ శ్రీలీల దీనికి పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తున్నట్లు అనిపిస్తోంది.

పెళ్లి సందD చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయం అయిన ఈ కన్నడ బ్యూటీ ఆ చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకోవడంతో మరో అవకాశం కోసం శ్రీలీల ఏడాదికి పైనే ఎదురు చూడాల్సి వచ్చింది. అయితే ఆ తరువాత ఈ భామకు అవకాశాలు వరుస కట్టాయి. ధమాకా వంటి చిత్రాలు హిట్‌ అవడంతో ఇప్పుడు అరడజనుకు పైగా చిత్రాలు చేతిలో ఉన్నాయి. లక్‌ అంటే ఈమెదే అన్నట్టుగా ఉంది పరిస్థితి.

ఇలాంటి సమయంలో శ్రీలీలకు కోలీవుడ్‌ నుంచి ఆఫర్‌ వచ్చినట్లు టాక్‌ స్ప్రెడ్‌ అవుతోంది. కమర్షియల్‌ డైరక్టర్‌ హరి తాజాగా విశాల్‌ హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో శ్రీలీలను హీరోయిన్‌గా ఎంపిక చేసే ప్రయత్నం చేసినట్లు, అయితే అందుకు ఈ బ్యూటీ కాల్‌షీట్స్‌ లేక నో చెప్పినట్టు టాక్‌ . ఈ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

చదవండి: ఎవరికీ చెప్పొద్దు అంటూ లీక్‌ చేసిన చిరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement