ప్రజాకవి కాళోజీకి మరో అవార్డు  | Special Jury Award in Feature Fiction Category at Indian World Film Festival 2024: Kaloji Narayana Rao biopic movie | Sakshi
Sakshi News home page

ప్రజాకవి కాళోజీకి మరో అవార్డు 

Published Mon, Mar 18 2024 4:09 AM | Last Updated on Mon, Mar 18 2024 4:09 AM

Special Jury Award in Feature Fiction Category at Indian World Film Festival 2024:  Kaloji Narayana Rao biopic movie - Sakshi

ప్రముఖ కవి, పద్మవిభూషణ్‌ కాళోజీ నారాయణరావు బయోపిక్‌గా రూపొందించిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’. మూలవిరాట్‌ (అశోక్‌ రెడ్డి) టైటిల్‌ రోల్‌లో నటించారు. డాక్టర్‌ ప్రభాకర్‌ జైనీ దర్శకత్వంలో జైనీ క్రియేషన్స్‌పై విజయలక్ష్మీ జైనీ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది విడుదలైంది. ఇప్పటికే పలు అవార్డులు సాధించిన ఈ మూవీ తాజాగా ఇండియన్‌ వరల్డ్‌ ఫిలిం ఫెస్టివల్‌ 2024లో ఫీచర్‌ ఫిక్షన్‌ కేటగిరీలో స్పెషల్‌ జ్యురీ అవార్డు సొంతం చేసుకుంది.

ఈ అవార్డును ప్రభాకర్‌ జైనీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘కాళోజీ నారాయణరావుగారి జీవిత విశేషాలతో ‘ప్రజాకవి కాళోజీ’ మూవీ తీసినందుకు చిత్రసీమకు చెందిన అనేక మంది ప్రముఖులు నన్ను ప్రశంసించారు. ఒక కవి మీద సినిమా తీయడం చాలా సాహసమని కొనియాడారు. మా సినిమాకి మొత్తం 8 అవార్డులు రావడం హ్యాపీ’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement