నా మూడేళ్ల కల స్పార్క్‌

SPARK Trailer Launch Event - Sakshi

– విక్రాంత్‌

విక్రాంత్‌ హీరోగా పరిచయం అవుతూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘స్పార్క్‌ ఎల్‌.ఐ.ఎఫ్‌.ఈ’. మెహరీన్, రుక్సార్‌ థిల్లాన్‌ హీరోయిన్లు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం నవంబరు 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో విక్రాంత్‌ మాట్లాడుతూ – ‘‘నాకు సినిమాలంటే ఇష్టం. అమెరికాలో జాబ్‌ చేస్తున్న క్రమంలో సంపాదనలో పడి కలను మర్చిపోకూడదని ఈ సినిమా తీశాను.

ఏడాదిన్నర పాటు ‘స్పార్క్‌’ కథ రాసుకుని, కష్టపడి మరో ఏడాదిన్నర పాటు ఈ సినిమాను నిర్మించాం. ‘స్పార్క్‌’ నా మూడేళ్ల కల. యాక్షన్, థ్రిల్, లవ్, కామెడీ, డ్రామా.. అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. యూనివర్సల్‌ అప్పీల్‌ ఉన్న మల్టీజానర్‌ ఫిల్మ్‌ ఇది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నా పాత్ర కొత్తగా ఉంటుంది’’ అన్నారు తమిళ నటుడు గురు సోమసుందరం. ‘‘టైటిల్‌కు తగ్గట్లే మా సినిమా ‘స్పార్క్‌’లా ఉంటుంది’’ అన్నారు మెహరీన్‌. ‘‘ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి స్పందన వస్తుండటం హ్యాపీ’’ అన్నారు చిత్ర సంగీత దర్శకుడు హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top