Detective Satyabhama Movie: సోనియా అగర్వాల్‌ 'డిటెక్టివ్‌ సత్యభామ'గా వచ్చేది అప్పుడే..

Sonia Agarwal Movie Detective Satyabhama Release Date Out - Sakshi

Sonia Agarwal Movie Detective Satyabhama Release Date Out: ‘7/జీ బృందావన కాలనీ’ సినిమా ఫేమ్‌ సోనియా అగర్వాల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘డిటెక్టివ్‌ సత్యభామ’. నవనీత్‌ చారి దర్శకత్వం వహించారు. శ్రీశైలం పోలెమోని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోనియా అగర్వాల్‌ మాట్లాడుతూ ‘‘7/జి బృందావన కాలని’ తర్వాత నాకు అంతగా గొప్పగా పేరు తెచ్చిన సినిమాలు లేవు. కానీ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అంత క్రేజ్‌ తెచ్చే మూవీ ‘డిటెక్టివ్‌ సత్యభామ’ అవుతుంది. ఈ సినిమా ఫస్ట్‌ కాపీ చూశాక అంత నమ్మకం వచ్చింది’’ అన్నారు. 

‘‘సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. నాలుగు పాటలతో పాటు యాక్షన్స్‌ సీన్స్‌ ఉంటాయి’’ అన్నారు డైరెక్టర్‌ నవనీత్‌ చారి. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా నిర్మించాం’’ అని శ్రీశైలం పోలెమోని అన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అంతం చేయడానికి సత్యభామ చేసిన పోరాటమే ఈ చిత్రం. ఇదివరకు విడుదలైన సినిమా ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది.

ఇదీ చదవండి: ‘డిటెక్టివ్‌ సత్యభామ’గా సోనియా అగర్వాల్‌, ట్రైలర్‌, ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top