లవ్‌ యూ మరిది గారూ.. భావోద్వేగానికి గురైన సోనం | Sakshi
Sakshi News home page

Sonam Kapoor: లవ్‌ యూ మరిది గారూ.. హీరోయిన్‌ భావోద్వేగం

Published Wed, Aug 18 2021 6:31 PM

Sonam Kapoor Gets Emotional In Rhea Kapoor Wedding Ceremony Pics - Sakshi

Sonam Kapoor In Rhea Kapoor Wedding: ‘‘మీరు ఎల్లప్పుడూ మా కుటుంబ సభ్యులే. మరిది కంటే కూడా ఒక స్నేహితుడిగానే మీరంటే నాకు ఎక్కువ అభిమానం. ఇప్పుడు మీరెంత సంతోషంగా ఉన్నారో.. నేను అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉన్నాను. లవ్‌ యూ’’ అంటూ బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనం కపూర్‌ తన సోదరి రియా కపూర్‌ భర్త కరణ్‌ బులానీ పట్ల ఆప్యాయతను చాటుకున్నారు. అతడితో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఆమె... తనకున్న గొప్ప స్నేహితుల్లో మరిదిగారు కూడా ఒకరంటూ ప్రేమను కురిపించారు. కాగా బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ చిన్న కుమార్తె, నిర్మాత రియా కపూర్- యాడ్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ కరణ్‌ బులానీ శనివారం వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.

గత 12 ఏళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ముంబైలోని జుహులో గల అనిల్‌ కపూర్‌ నివాసంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఇక భర్త ఆనంద్‌ అహుజాతో కలిసి లండన్‌లో ఉంటున్న సోనం కపూర్‌ సోదరి రియా వివాహానికి హాజరయ్యేందుకు ముంబైకి వచ్చారు. వివాహ తంతు జరుగుతున్న సమయంలో సోనం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇక చెల్లెలి పెళ్లి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న ఫొటోలను సోనం సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌ అవుతున్నాయి.

చదవండి: Rhea Kapoor: నా బెస్ట్‌ఫ్రెండ్‌ని పెళ్లాడాను.. ఎంతగా ఏడ్చానో..
పూజా హెగ్డేపై డైరెక్టర్‌ ఆర్కే సెల్వమణి ఫైర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement