Rhea Kapoor Gets Emotional As She Shares First Pic With Husband Karan Boolani - Sakshi
Sakshi News home page

Rhea Kapoor: నా బెస్ట్‌ఫ్రెండ్‌ని పెళ్లాడాను.. ఎంతగా ఏడ్చానో..

Aug 16 2021 5:42 PM | Updated on Aug 16 2021 7:08 PM

Rhea Kapoor Shares First Pic Marrying Karan Boolani Emotional Post - Sakshi

12 ఏళ్లు ప్రేమలో ఉన్న రియా- కరణ్‌ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు..

Rhea Kapoor- Karan Boolani Pic After Mariage: ‘‘12 ఏళ్ల తర్వాత.. నాకు మరీ అంత సంతోషంగా ఏమీ లేదు. అలా అని నర్వస్‌గా కూడా ఫీలవడం లేదు.. ఎందుకంటే నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. అత్యుత్తమైన వ్యక్తివి కూడా. కానీ ఈరోజు నేను ఎంతగా ఏడ్చానో.. భయంతో వణికిపోయానో నాకే తెలుసు. ఇలాంటి ఒక అద్భుతమైన క్షణాన్ని, ఆనందాన్ని నేను ఇంతవరకు అనుభవించలేదు కదా! ప్రతిరోజు రాత్రి 11 గంటల కంటే ముందే.. నా తల్లిదండ్రులు నిద్రపోకముందే.. ఇంటికి చేరుకునే అమ్మాయిని నేను. ఇప్పుడు మనదైన సరికొత్త కుటుంబంలో కూడా అమ్మానాన్నలు, నా తోబట్టువులతో కలిసి జీవించడం నిజంగా గొప్ప అనుభూతి’’ అంటూ బాలీవుడ్‌ నిర్మాత రియా కపూర్‌ భావోద్వేగానికి గురయ్యారు.


సోదరి రియా వివాహానికి హాజరైన సోనం కపూర్‌ దంపతులు

కాగా బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనిల్‌ కపూర్‌- సునీత కపూర్‌ల చిన్న కుమార్తె రియా కపూర్‌ పెళ్లి శనివారం జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలోని జుహులో గల అనిల్‌ కపూర్‌ ఇంట్లో అత్యంత సన్నిహితుల సమక్షంలో రియా- కరణ్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా భర్త కరణ్‌ బులానీతో కలిసి ఉన్న తమ పెళ్లి ఫొటోను షేర్‌ చేసిన సందర్భంగా అతడిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు.


భర్త ఆనంద్‌ అహుజాతో సోనం కపూర్‌

ప్రాణ స్నేహితుడిని జీవిత భాగస్వామిగా పొందిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేమంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో నవ దంపతులకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కాగా కరణ్‌ బూలానీ పలు యాడ్స్‌ నిర్మించి గుర్తింపు పొందాడు. రియా సైతం పలు బాలీవుడ్‌ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అంతేగాక ఇద్దరూ కలిసి ఐషా, వేక్ అప్ సిద్‌ వంటి చిత్రాలకు కలిసి పనిచేశారు. ఇక వీరి వివాహానికి హాజరయ్యేందుకు రియా సోదరి, బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌ సోనం కపూర్‌ లండన్‌ నుంచి ముంబైకి చేరుకున్నారు. ఈ వివాహ వేడకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement