నా పెళ్లి అక్కడే జరగాలి : హీరోయిన్‌

Sonal Chauhan Wants Two Weddings One At The Beach And one In The Mountains - Sakshi

హాట్‌ ఫోటోలతో ఆకట్టుకుంటున్న సోనాల్‌ చౌహాన్‌

సోనాల్ చౌహాన్.. తెలుగులో బాలకృష్ణ సరసన 'లెజెండ్', 'డిక్టేటర్' సినిమాలో నటించింది. లెజెండ్ సినిమా సూపర్ హిట్టైనా కూడా తెలుగులో ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలైతే రాలేదు. అయితే వీలున్నప్పుడల్లా విదేశీ బీచ్‌లలో బికినీలతో ఫోటోలకు ఫోజ్‌లిస్తూ..  కుర్రకారు గుండెల్లో హిట్ పెంచేస్తోంది.

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి ఎలా జరగాలో, ఎలాంటి వ్యక్తి తన జీవితంలోకి రావాలనుకుంటుందో చెప్పుకొచ్చింది. తనకు ప్రకృతి అంటే చాలా ఇష్టమని, తన పెళ్లి సాగర తీరం వేదికగా లేదా కొండ ప్రాంతంలో జరగాలని  కోరుకుంటున్నానని చెప్పింది.

‘ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం.ప్రకృతిని మించిన అందం  ఇంకోటి లేదు. నా వివాహం రెండు చోట్ల జరగాలని ఆశిస్తున్నాను. సాగర తీరం ఓ వేదికగా, కొండ ప్రాంతం మరో వేదికగా నా వివాహం జరగాలని కోరుకుంటున్నా​. కానీ ఇప్పటి వరకు నాకు నచ్చిన వ్యక్తి తారాసపడలేదు’అని సోనాల్‌ సెలవిచ్చింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top