Snehan Ties Knot With Kannika Ravi, Kamal Haasan Attends Event - Sakshi
Sakshi News home page

Kamal Haasan: నటితో గీత రచయిత పెళ్లి, తాళి అందించిన కమల్‌

Jul 30 2021 8:59 AM | Updated on Jul 30 2021 9:32 AM

Snehan Ties Knot With Kannika Ravi, Kamal Haasan Attends Event - Sakshi

Snehan Weds Kannika Ravi: మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ సమక్షంలో గీత రచయిత స్నేహన్‌ వివాహం గురువారం చెన్నైలో జరిగింది. స్నేహన్‌ మక్కల్‌ నీది మయ్యం పార్టీలో కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈయన, నటి కన్నిక రవి గురువారం అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు.

చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో జరిగిన వీరి వివాహవేడుకకు కమల్‌ హాజరయ్యారు. కమల్‌ చేతుల మీదుగా తాళిని అందించగా స్నేహన్, కన్నిక రవి మెడలో మాంగల్యధారణ చేశారు. దర్శకుడు భారతీరాజా, జ్ఞానసంబంధం  హాజరై నూతన దంపతులకు శుభాశీస్సులు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement