చిన్న చిత్రాలకు థియేటర్లు లభించడం లేదు : డైరెక్టర్‌ ఆవేదన

Small Budget Movies Struggle To Find Theatres Says Director Kalanjiyam - Sakshi

తమిళసినిమా: చిన్న చిత్రాలకు థియేటర్లు లభించడం లేదని ఎం కళైంజియం ఆవేదన వ్యక్తం చేశారు. గుడ్‌ న్యూస్‌ ఫిలిం పతాకంపై జవహర్‌ సమర్పణలో శ్రీమతి రతి జవహర్‌ నిర్మింన చిత్రం కల్లరై. ఏబీఆర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమం పూర్తి చేసుకుంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. హర్రర్, థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన ఇందులో నూతన తారలు నటించారు. రాంజీ సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియా, ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం స్థానిక నుంగంబాక్కంలోని లీ మ్యాజిక్‌ ల్యాంటన్‌ ప్రివ్యూ థియేటర్లో నిర్వహించారు.

కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఆర్‌.ముత్తరసన్, నిర్మాత, నటుడు కే రాజన్, దర్శకుడు ఎం కళంజియం, సంగీతకుడు సౌందర్యన్, నిర్మాతల మండలి కార్యవర్గ సభ్యుడు విజయ మురళి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత రతి జవహర్‌ మాట్లాడుతూ.. ఇది తమ తొలి ప్రయత్నం అని, దర్శకుడు అనుకున్న బడ్జెట్‌లో చిత్రాన్ని చక్కగా తెరకెక్కిం ఎంతగానో సహకరించారని చెప్పారు. రాజన్‌ మాట్లాడుతూ.. చిన్న చిత్రాలను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎందుకంటే చిత్ర పరిశ్రమను బతికించేది చిన్న చిత్రాల నిర్మాతలే అన్నారు.

ఈ చిత్రం పెట్టిన పెట్టుబడిని తిరిగి తీసుకొస్తే ఈ నిర్మాతలు మళ్లీ చిత్రం చేస్తారన్నారు. పెద్ద చిత్రాల హీరోల వల్ల ఎవరికి ఏమీ వొరిగేది లేదని.. వారు సంపాదించుకోవడమేనని అన్నారు. దర్శకుడు ఎం కలైంజయం మాట్లాడుతూ.. చిన్న చిత్రాలకు థియేటర్లు లభించడం లేదని, పెద్ద హీరోల చిత్రాలే థియేటర్లను ఆక్రమిస్తున్నాయని తెలిపారు. ఈ విషయమై మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉదయనిధి స్టాలిన్‌ తగిన చర్యలు తీసుకుని చిన్న చిత్రాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top