
ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అన్ని రకాల ఫ్లాట్‌ఫామ్స్‌లో కనిపిస్తున్నారు. అయితే సోషల్ మీడియా వల్ల మంచి ఉన్నట్లే చెడు కూడా బోలెడంత ఉంది. ఫేక్ అకౌంట్ల బాధ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. సెలబ్రిటీలు, వాళ్ల పిల్లలు వీటి బారిన పడుతుంటారు. ఇప్పుడు మహేశ్ బాబు కూతురు సితారకు కూడా అలాంటి అనుభవమే ఎదురైనట్లు ఉంది. దీంతో ఓ పోస్ట్ పెట్టింది. క్లారిటీ ఇచ్చింది.
(ఇదీ చదవండి: ప్రభాస్.. రూ.50 కోట్లు తిరిగిచ్చేశాడు: డిస్ట్రిబ్యూటర్)
'నా పేరు మీద పలు ఫేక్ అకౌంట్స్ ఉన్నట్లు దృష్టికి వచ్చింది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ.. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే అకౌంట్ ఉంది. ఇదే నా అఫీషియల్. ఏదైనా చెప్పాలనుకుంటే దీని ద్వారా చెబుతా. వేరే ఏ సోషల్ మీడియాలోనూ నాకు ఖాతా లేదు' అని సితార ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. మరి సితారకు ఈ మధ్య కాలంలో ఫేక్ అకౌంట్స్ వల్ల ఏదైనా సమస్య ఎదురైందేమోనని అనిపిస్తుంది. లేదంటే సడన్‌గా ఇప్పుడెందుకు ఈ పోస్ట్ పెడుతుంది?
సితార విషయానికొస్తే క్లాసికల్ డ్యాన్స్ లాంటివి నేర్చుకుంటుంది. ప్రస్తుతానికైతే టీనేజర్. నటి అవుతానని గతంలో ఓసారి చెప్పింది. మరి ఎప్పుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందో చూడాలి? మహేశ్ బాబు విషయానికొస్తే రాజమౌళితో సినిమా చేస్తున్నారు. పదిరోజుల క్రితం మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా అప్డేట్ వస్తుందని అభిమానులు ఎదురుచూశారు కానీ నవంబరులోనే అలాంటివి ఉంటాయని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.
(ఇదీ చదవండి: దెయ్యంగా రష్మిక.. 'వరల్డ్ ఆఫ్ థామా' చూశారా?)