సింగర్‌కు అధ్భుతమైన టాలెంట్‌.. ట్రాన్స్‌జెండర్‌ అంటూ కామెంట్స్‌ | Singer Lekshmi Jayan Wonderful Talent, Netizen Commented as Transgender | Sakshi
Sakshi News home page

రెండు గొంతుల్లో పాడేస్తున్న బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌.. వీడియో వైరల్‌

Jul 20 2024 2:37 PM | Updated on Jul 20 2024 3:03 PM

Singer Lekshmi Jayan Wonderful Talent, Netizen Commented as Transgender

కొందరు పురుషులకు స్త్రీ గొంతుతో మాట్లాడటం వచ్చు. ఆడవారి గొంతును అనుకరించి పాటలు కూడా పాడతారు. అయితే విడ్డూరంగా ఓ మహిళ అబ్బాయిలా మాట్లాడగలదు, పాటలూ పాడగలదు. ఆవిడే సింగర్‌ లక్ష్మి జయన్‌. కేరళలోని తిరువనంతపురానికి చెందిన ఈమె మలయాళ బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లోనూ పాల్గొంది. రేడియో హోస్ట్‌గానూ పని చేసిన ఈమె అనేక కార్యక్రమాల్లో హాజరై తన గొంతుతో అందరినీ అబ్బురపరుస్తోంది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలోనూ తన టాలెంట్‌ చూపించింది.

రెండు వర్షన్లు తానే..
రోజా సినిమాలోని పరువం వానగా పాట మలయాళ వర్షన్‌ను ఆలపించింది. ఈ సాంగ్‌లో వచ్చే మేల్‌, ఫిమేల్‌ వర్షన్‌ రెండింటినీ తనే పాడింది. సెకన్లలోనే తన గొంతును మార్చుతూ అద్భుతంగా పాట పాడుతున్న ఆమె వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన కొందరు ఆమె ప్రతిభను మెచ్చుకుంటుండగా మరికొందరు మాత్రం ట్రాన్స్‌జెండర్‌ అని తప్పుగా అభిప్రాయపడుతున్నారు. దీంతో లక్ష్మి అభిమాని ఒకరు ఇటువంటి కామెంట్లకు గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

తెలీకుండా మాట్లాడొద్దు
సింగర్‌ లక్ష్మి వందశాతం మహిళే. తనకు ఓ బాబు కూడా పుట్టాడు. ఆమె బిగ్‌బాస్‌ స్టార్‌, వయొలనిస్ట్‌, టీవీ యాంకర్‌, రేడియో జాకీ.. ఒక్కమాటలో చెప్పాలంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. తనెవరో తెలియకపోతే తెలుసుకోండి. అంతేకానీ ఏది పడితే అది మాట్లాడొద్దు అని స్వీట్‌ వార్నింగ్‌ కూడా ఇచ్చారు.

 

 

చదవండి: ఆ విషయంలోనే మాకు తరచూ గొడవలు: హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement