సింగీతం... స్క్రిప్ట్‌ మెంటార్‌ | Sakshi
Sakshi News home page

సింగీతం... స్క్రిప్ట్‌ మెంటార్‌

Published Tue, Sep 22 2020 2:25 AM

Singeetham Srinivasa Rao turns mentor for Prabhas Movie - Sakshi

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై ఈ ప్యాన్‌ ఇండియా ఫిల్మ్‌ను సి. అశ్వినీదత్‌ నిర్మించనున్నారు. ఓ ఆసక్తికరమైన విషయమేంటంటే... తన కెరీర్‌లో ఎన్నో ప్రయోగాత్మక బ్లాక్‌బస్టర్స్‌ను రూపొందించిన లెజండరీ డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావు ఈ ప్రాజెక్ట్‌కు స్క్రిప్ట్‌ మెంటార్‌గా వ్యవహరించనున్నారు. సింగీతం పుట్టినరోజు సందర్భంగా సోమవారం (సెప్టెంబర్‌ 21) ఈ చిత్రానికి ఆయన మెంటార్‌గా చేస్తున్న విషయాన్ని ప్రకటించారు. ‘‘మా ఎపిక్‌కు సింగీతం శ్రీనివాసరావుగారిని ఆహ్వానిస్తున్నందుకు థ్రిల్‌ ఫీలవుతున్నాం. ఆయన క్రియేటివ్‌ సూపర్‌ పవర్స్‌ కచ్చితంగా మాకు మార్గదర్శక శక్తిగా ఉంటుంది’’ అని వైజయంతీ మూవీస్‌ ప్రకటించింది.

Advertisement
 
Advertisement