సిల్క్‌ స్మితకు ఆ పాత్రలంటే ఇష్టం ఉండేవి కాదు..

Silk Smitha Birth Anniversary: Here Is Her Life Story And Movies - Sakshi

తెరపై కనిపించే రంగుల ప్రపంచం కాదు నా జీవితం..

సాక్షి, హైదరాబాద్‌: సిల్క్‌ స్మిత ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దక్షిణాదిన తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సిల్క్ స్మిత (డిసెంబర్‌ 2) జయంతి నేడు. ఈ సందర్భంగా మరోసారి ఆమెను గుర్తు చేసుకుందాం. 1960 డిసెంబర్‌ 2న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించిన ఆమె ఒక మేకప్ ఆర్టిస్ట్‌గా తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత సినమాల్లో సపోర్టు క్యారెక్టర్స్‌‌ చేసుకుంటున్న తరుణంలో 1979లో ఆమె నటించిన తమిళ సినిమా ‘వండిచక్రం’తో ఆమె కేరీర్‌ మలుపు తిరిగింది. ఇందులో బార్‌ డ్యాన్సర్‌గా గ్లామర్‌ పాత్ర పోషించి ఆమెకు రాత్రి రాత్రే స్టార్‌డమ్‌ వచ్చింది.

అలా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సహా పలు భాషల్లో 450కి పైగా సినిమాల్లో నటించారు. రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, మోహన్ లాల్, అక్కినేని నాగార్జున, మమ్ముట్టి వంటి సూపర్ స్టార్‌లతో కలిసి నటించిన సిల్క్‌ స్మిత తన జీవితం తెరపై కనిపించినంత రంగుల మయం కాదని ఎప్పుడూ ఆవేదన వ్యక్తం చేస్తూండేవారు. ఈ క్రమంలోనే ఆమె అర్థాంతరంగా తనువు చాలించి సినీ పరిశ్రమను శోకసంద్రంలోకి నెట్టారు. (చదవండి: పవన్‌ ఫొటో షేర్‌ చేసిన రేణు దేశాయ్‌)

అయితే ఆమె మరణవార్త విని బాధపడిన వారు ఎంతమంది ఉన్నారో.. ఆమె లేదని సంతోషించిన వారు సైతం కూడా ఉన్నారు. ఎందుకంటే నటిగా ఆమె తీసుకునే ధైర్యమైన నిర్ణయాలు, వాటితో స్మితకు వచ్చిన పేరును చూసి చాలామంది అసూయపడేవారు. అయితే పరిశ్రమలో అంతటి పేరు తెచ్చుకున్న ఆమె జీవిత కథ తెలిసిన వారు మాత్రం కన్నీరు పెట్టుకోవాల్సిందే. ఓ చిన్న పల్లెటూరిలో పుట్టిన ఆమె అసలు పేరు విజయ లక్ష్మీ వడ్లపాటి. తన తల్లిదండ్రులు చదివించలేక నాలుగో తరగతిలోనే ఆమెను స్కూల్ మాన్పించారు. అంతేకాకుండా చిన్న వయసులోనే వివాహం చేసి పంపించారు. అయితే అక్కడ భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక రైలెక్కి చెన్నై వెళ్లిన ఆమె సినిమా అవకాశాల కోసం ఎదురుచుశారు. ఈ క్రమంలో పలు సినిమాల్లో ఐటెం సాంగ్‌లో నటించిన ఆమె ఆ తర్వాత  వెండితెరను ఏలే శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలా బోల్డ్‌ క్యారెక్టర్స్‌తో స్టార్‌ నటిగా ఎదిగిన ఆమెకు అసలు ఆ పాత్రలంటే ఇష్టం ఉండేవి కాదని స్వయంగా ఆమె పలు ఇంటర్య్వూలో వెల్లడించారు. (చదవండి: ఆమె అంతే!)

నిజానికి మంచి ఆర్టిస్టు కావాలన్న ఆమె కోరిక అందుకోసమే సినిమాల్లోకి వచ్చారు. అయితే తమిళంలో వచ్చిన ‘వండిచక్రం’ సినిమాలో సిల్క్‌ స్మితా అనే బార్‌ డ్యాన్సర్‌గా నటించిన ఆమె పాత్రకు మంచి గుర్తింపు రావడంతో అప్పటి నుంచి దర్శక నిర్మాతలు అలాంటి పాత్రలే ఇచ్చారు. ఇష్టం లేకున్న వరుసగా అలాంటి పాత్రలే చేయడంతో అలా సిల్క్ స్మిత అంటే గ్లామర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ తరుణంలోనే 1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత చెన్నైలోని తన అపార్ట్‌మెంట్‌లో అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. అయితే ఆమె మృతి ఎన్నో అనుమానాలతో ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. ఈ క్రమంలో సిల్క్‌ స్మిత జీవిత కథ ఆధారంగా హిందీలో ‘ది డర్టీ పిక్చర్‌’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో విద్యాబాలన్‌ స్మితా పాత్రను పోషించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top