Sidharth Shukla Funeral: కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న షెహనాజ్‌

Sidharth Shukla Funera: Shehnaaz Gill Inconsolable At Siddarth Funeral - Sakshi

బిగ్‌బాస్‌-13 విన్నర్‌, టీవీ నటుడు సిద్ధార్థ్‌ శుక్లా హఠాన్మరణంతో బాలీవుడ్‌లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. గుండెపోటుతో సిద్దార్థ కన్నుమూశాడన్న వార్తతో నిద్రలేచిన బీ-టౌన్‌ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే శుక్లా మరణించినట్లు ముంబైలోని కూపర్‌ ఆసుపత్రి ధృవీకరించిన సంగతి తెలిసిందే. తీవ్రమైన గుండెపోటుతో గురువారం తెల్లవారుజామున్న ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా ఈ రోజు ముంబైలోని జూహులో సిద్దార్థ్‌కు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ క్రమంలో సహా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌, పలువురు టీవీ నటీనటులు అజిమ్‌ రియాజ్‌, అర్జున్‌ బిజ్‌లానీ, ఆర్తి సింగ్‌, వికాస్‌ గుప్తా, రాఖీ సావంత్‌, అలీ గోని, ప్రిన్స్‌ నారులా, రషమీ దేశాయ్‌ తదితరులు సిద్ధార్థ్‌ ఇంటికి చేరుకున్నారు.

చదవండి: Sidharth Shukla: సిద్ధార్థ్‌ శుక్లా మృతి..షూటింగ్‌ నుంచి వెళ్లిపోయిన షెహనాజ్‌

ఆయన కుటుంబాని​కి సంతాపం తెలిపారు. కాగా సిద్ధార్థ్‌ అంత్యక్రియలకు అతడి రూమర్డ్‌ గర్ల్‌ఫ్రెండ్‌, బిగ్‌బాస్‌ సహా కంటెస్టెంట్‌ షెహనాజ్‌ గిల్‌, ఆమె తల్లి కూడా హజరయ్యారు. తల్లితో పాటు కారులో వచ్చిన సెహనాజ్‌ కన్నీరు మున్నీరుగా విలపిస్తుండం చూస్తే బాధిస్తోంది. ఏకదాటిగా ఎడుస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియా వైరల్‌ అవుతున్నాయి. తీవ్ర శోకంలో మునిగిపోయిన షెహనాజ్‌ను చూసి ‘ఆమెకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ఆశిస్తున్నాము’, ‘ఇప్పుడు తన బాధ వర్ణించలేనిది’ అంటూ నెటిజన్లు, సిద్‌నాజ్‌ ఫ్యాన్స్‌ స్పందిస్తున్నారు.

చదవండి: డాక్టర్లు హెచ్చరించినా సిద్ధార్థ్ శుక్లా పట్టించుకోలేదా?

నిన్న ఆయన మరణవార్త విన్నప్పటి నుంచి ఆమె ఏకదాటిగా ఏడూస్తూనే ఉందని, ఆమె పరిస్థితి అసలు బాగాలేదని ఆమె తండ్రి మీడియాతో పేర్కొన్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌ సీజన్‌13లో పాల్గొన్న సిద్ధార్ద్ -షెహనాజ్‌ల లవ్‌ ట్రాక్‌ ఎంతలా ఫేమస్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కపుల్‌కి సోషల్‌ మీడియాలోనూ పెద్ద ఎత్తున ఫ్యాన్‌ బేస్‌ ఉంది. అంతేకాకుండా బిగ్‌బాస్‌ షో పూర్తయిన తర్వాత కూడా వీళ్ల బంధం కొనసాగింది. వీరిద్దరూ కలిసి చివరగా డ్యాన్స్‌ దివానే-3 షోలో పాల్గొని సందడి చేశారు. సిద్ధార్థ్‌ ఆకస్మిక మరణంతో 'సిద్‌నాజ్‌' ఫర్‌ ఎవర్‌ అంటూ ఫ్యాన్స్‌ ట్విట్టర్‌లో ట్రెండ్‌ చేస్తు వారిద్దరికి సంబంధించిన పలు వీడియోలను సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు. 

చదవండి: Siddharth Shukla: షెహనాజ్‌తో ప్రేమాయణం..‘సిద్నాజ్‌’గా ఫేమస్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top