Siddharth Shukla: అంత్యక్రియల్లో రెండుసార్లు స్పృహ కోల్పోయిన షెహనాజ్‌

Sidharth Shukla And Shehnaaz Gill Were Planning To Marriage On December 2021 - Sakshi

ప్రముఖ టీవీ నటుడు సిద్ధార్ద్ శుక్లా(40) మరణంతో బాలీవుడ్‌ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 13 విజేతగా నిలిచిన సిద్ధార్ద్ శుక్లా గుండెపోటు కారణంగా గురువారం(సెప్టెంబర్‌ 2) తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ముంబైలోని జూహులో నేడు సిద్ధార్థ్‌ అంత్యక్రియలు ముగిశాయి. కాగా ప్రియుడి అంత్యక్రియల్లో పాల్గొన్న నటి షెహనాజ్‌ గిల్‌ కన్నీరు మున్నీరుగా విలిపించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అంతేగాక ఈ కార్యక్రమం ముగిసే సరికి ఆమె రెండు సార్లు స్పృహా కోల్పోయినట్లు సమాచారం. ఈ క్రమంలో సిద్ధార్థ్‌-షెహనాజ్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

చదవండి: Sidharth Shukla Funeral: కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న షెహనాజ్‌

‘సిద్‌నాజ్‌’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ జంట బిగ్‌బాస్‌ సీజన్‌ 13లో కలుసుకున్న సంగతి తెలిసిందే. హౌజ్‌లో వీరి లవ్‌ ట్రాక్‌ ఎంతలా ఫేమస్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కపుల్‌కి సోషల్‌ మీడియాలోనూ పెద్ద ఎత్తున ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అంతేగాక అత్యంత అందమైన జంటగా వీరిద్దరూ అందరిచేత ప్రశంసలు అందుకున్నారు. దీనికి తోడు వీరిద్దరూ ఒకరంటే ఒకరు ప్రాణంగా ప్రేమించుకున్నారట. అంతలా ప్రేమలోకంలో విహరించిన ఈ జంట వివాహ బంధంతో ఒక్కటవ్వాలని నిశ్చయించుకుందట. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఇరుకుటుంబాలు కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

చదవండి: ఆరోజు రాత్రి ఏం జరిగింది.. సిద్దార్థ్‌ పోస్ట్‌మార్టం నివేదికలో ఏముంది?!

దీంతో డిసెంబర్‌ 2021లో సిద్ధార్థ్‌-షెహనాజ్‌లు పెళ్లి చేసుకోవాలి నిర్ణయించుకున్నారట. అంతేకాదు వారి వివాహ వేధిక కోసం ప్లస్‌ ముంబై హోటల్‌ను మూడు రోజుల పాటు బుక్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. తమ పెళ్లి వేడుకకు సంబంధించిన ఏర్పాట్ల గురించి షహనాజ్‌-సిద్ధార్థ్‌లు తరచూ మాట్లాడుకునేవారట. ఈ క్రమంలో సిద్ధార్థ్‌ హఠాన్మరణం ఈ రెండు కుటుంబాల్లో ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో వర్ణించలేనిది. సిద్ధార్థ్‌తో జీవితాన్ని పంచుకోవాలని కోటీ ఆశలతో ఉన్న షెహనాజ్‌ ఇప్పుడు ఎలాంటి గడ్డు పరిస్థితులను చూస్తుందో తలచుకుంటూనే గుండె బరువేక్కుతోంది. ఇది విని ఈ జంట అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. అంతేకాదు సిద్ధార్థ్‌కు నివాళులు అర్పిస్తూ ఆయన కటుంబానికి సంతాపం తెలుపుతున్నారు. ఇక షెహనాజ్‌కు ఆ దేవుడు గుండె ధైర్యం ఇవ్వాలని ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top