Siddharth Special Wishes To Aditi Rao Hydari On Her Birthday - Sakshi
Sakshi News home page

Aditi Rao Hydari: హీరోయిన్‌ మీద ప్రేమను బయటపెట్టిన సిద్దార్థ్‌, ఫొటో వైరల్‌

Oct 28 2022 4:37 PM | Updated on Oct 28 2022 6:25 PM

Siddharth Special Wishes To Aditi Rao Hydari On Her Birthday - Sakshi

తొలిసారి అదితితో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశాడీ హీరో. హ్యాపీ హ్యాపీ బర్త్‌డే ప్రిన్సెస్‌ ఆఫ్‌ హార్ట్‌, నీ కలలన్నీ సాకారం కావాలని మనసారా కోరుకుంటున్నాను..

అందాల ముద్దుగుమ్మ అదితి రావు హైదరీ నేడు(అక్టోబర్‌ 28) 36వ పడిలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందులో హీరో సిద్దార్థ్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఎందుకంటే వీరిద్దరి మధ్యలో ఏదో ఉందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య వీళ్లు ఓ సెలూన్‌ నుంచి కలిసి బయటకు వస్తూ కెమెరాలకు చిక్కారు.

ఇకపోతే తొలిసారి అదితితో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశాడీ హీరో. 'హ్యాపీ బర్త్‌డే ప్రిన్సెస్‌ ఆఫ్‌ హార్ట్‌, నీ కలలన్నీ సాకారం కావాలని మనసారా కోరుకుంటున్నాను' అని రాసుకొచ్చాడు. ఇక్కడ ప్రిన్సెస్‌ ఆఫ్‌ హార్ట్‌ అంటే అందరి హృదయాల్లో కొలువైన రాణి అంటున్నాడా? లేదా తన మనసు దోచుకున్న మహారాణి అని హింటిస్తున్నాడా? అర్థం కావడం లేదంటున్నారు నెటిజన్లు. ఇకపోతే అదితి.. సిద్దార్థ్‌తో బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసుకోవడానికి చెన్నైకి చెక్కేసిందట. మరి ఈ బర్త్‌డే వేడుకల ఫొటోలను వారు ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటారో లేదో చూడాలి!

చదవండి: తొక్కలో పంచాయితీ, ఎంత చెప్పినా గీతూ వినదే!
నిజమే, పూరీ పెద్ద మోసగాడు.. పరువు తీయాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement