శుభ్‌మన్‌కు కాదు.. రష్మికకే అతడంటే క్రష్‌.. | Shubman Gill Has A Crush On Rashmika Mandanna | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: శుభ్‌మన్‌ గిల్‌ అంటే క్రష్‌ అని కన్నుగీటి మరీ చెప్పిన రష్మిక

Mar 16 2023 6:26 AM | Updated on Mar 16 2023 1:09 PM

Shubman Gill Has A Crush On Rashmika Mandanna - Sakshi

నటి రష్మిక మందన్నా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇటీవల హిందీ, తమిళం భాషల్లో నటించిన చిత్రాలు నిరాశపరచడం, కొత్త అవకాశాలు రాకపోవడంతో తన మార్కెట్‌ డౌన్‌ అవుతుందనే అభద్రాతాభావంతో ఉందో ఏమోగానీ ఈ అమ్మడు పబ్లిసిటీ ట్రిక్స్‌ మొదలెట్టింది. అందులో భాగంగా ఇటీవల గ్లామరస్‌ దుస్తులతో కనిపిస్తోంది. అలాంటి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఈ అమ్మడిని టాలీవుడ్‌ నటుడు విజయ్‌దేవరకొండతో కలిపి చాలా విషయాలు ఇప్పటికే ట్రోలింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సంచలన జంట విదేశీ టూర్‌ కూడా వెళ్లి వార్తల్లో నిలిచారు. అయితే తమ మధ్య మంచి ఫ్రెండ్‌షిప్‌ మాత్రమే అని ఇద్దరూ చెబుతుంటారు. కాగా రష్మిక అంటే భారత క్రికెటర్‌  శుభమాన్ గిల్ కి క్రష్‌ అనే ప్రచారం హోరెత్తింది. అయితే అదంతా వదంతి అని శుభమాన్ గిల్ వివరణ ఇచ్చారు. దీంతో ఈ ప్రచారానికి తెరదించారని అందరూ అనుకున్నారు. అయితే నటి రష్మిక ఆ ప్రచారానికిప్పుడు ఆజ్యం పోసింది.

ఈ బ్యూటీ ఒక ఫ్యాషన్‌ షాలో పాల్గొని అందాలను ఆరబోసింది. ఈ సందర్భంగా రష్మికను శుభమాన్ గిల్ పై మీకు క్రష్‌ ఉందా అని మీడియా అడగ్గా యా అంటూ కన్నుగీటింది. దీంతో ఇప్పుడు వీరి గురించి చర్చ వైరల్‌ అవుతోంది. 23 ఏళ్ల శుభమాన్ గిల్ పై 26 ఏళ్ల రష్మికకు క్రష్‌ అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక నటుడు అల్లు అర్జున్‌కు జంటగా పుష్ప 2 చిత్రంలో నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement