బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌.. తొలిసారి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్‌! | Sakshi
Sakshi News home page

Shruti Haasan: శాంతనుతో బ్రేకప్‌.. క్లారిటీ ఇచ్చేసిన శృతిహాసన్!

Published Thu, May 23 2024 6:34 PM

Shruti Haasan finally confirms breakup with Santanu Hazarika

స్టార్ హీరోయిన్‌ శృతిహాసన్ ప్రస్తుతం ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్‌ శాంతను హజరికాతో బంధానికి గుడ్‌ బై చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఈ రూమర్స్‌కు మరింత బల చేకూరింది. అయితే ఈ విషయాన్ని శృతిహాసన్‌ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.

అయితే తాజాగా శృతిహాసన్‌  ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మి ఎనీథింగ్ అనే సెషన్‌ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ఓ నెటిజన్‌ శృతి రిలేషన్‌షిప్‌ గురించి ప్రశ్నించారు. ప్రస్తుతం మీరు సింగిలా?  లేదా కమిట్ అయ్యారా? అని నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి శృతి తన రిలేషన్‌ గురించి క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం తాను ఒంటరిగా ఉన్నానని తెలిపింది.

శృతి హాసన్‌ స్పందిస్తూ.. 'ఇలాంటి ప్రశ్నలకు సమాధానమివ్వడం నాకు సంతోషం అనిపించదు. కానీ నేను ప్రస్తుతానికైతే సింగిల్‌గానే ఉన్నా. మింగిల్‌ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నా. ప్రస్తుతానికి నా పనిని ఆస్వాదిస్తున్నా. అందులోనే నేను ఆనందంగా ఉన్నా. ప్రస్తుతానికి నాకు ఇది చాలు' అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో శాంతను హజరికాతో బ్రేకప్‌ అయినట్లు క్లారిటీ ఇచ్చేసింది. గతంలో వీరిద్దరూ విడిపోతున్నారంటూ వార్తలొచ్చాక తొలిసారి శృతిహాసన్‌ స్పందించింది.

కాగా.. శృతిహాసన్‌, శాంతను కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. వీరిద్దరూ ముంబయిలోనే సహజీవనం చేశారు. గతంలో ఎప్పటికప్పుడు తమ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకునేవారు. ప్రస్తుతం  ఈ జంట విడివిడాగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. కాగా.. శృతిహాసన్‌ ప్రస్తుతం అడివి శేష్‌ సరసన డకాయిట్ చిత్రంలో కనిపించనుంది. ఆ తర్వాత చెన్నై స్టోరీ, సలార్‌ పార్ట్-2:  శౌర్యంగ పర్వంలోనూ నటించనుంది. 
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement