అదొక పెద్ద స్కామ్‌.. అయినా అదే కోరుకుంటున్నా: జోష్‌ నటి | Actress Shreya Dhanwanthary Calls Buying House In Mumbai Is A Scam, Says Stupidly Expensive Dream | Sakshi
Sakshi News home page

Shreya Dhanwanthary: అదొక తెలివితక్కువ ఆలోచన.. తెలిసి కూడా అదే కావాలనిపిస్తోంది!

Sep 6 2024 5:04 PM | Updated on Sep 6 2024 5:29 PM

Shreya Dhanwanthary: Buying House in Mumbai is a Scam

మన దేశంలో ఎక్కువమంది కలగనేది సొంతింటి గురించే! ఎంతోమంది రూపాయిరూపాయి కూడబెట్టి ఎప్పటికైనా ఇల్లు కట్టుకోవాలని ఆశపడతారు. కానీ ఈ రోజుల్లో ఇల్లు కట్టడమనేది స్థోమతకు మించిన భారంగా మారింది. జీవితాంతం కష్టపడినా ఇల్లు కట్టే లేదా కొనే పరిస్థితులు కనిపించడం లేదు.

అదొక స్కామ్‌
నటి శ్రేయ ధన్వంతరి కూడా ఇదే అంటోంది. ముంబైలో ఇల్లు కొనడమనేది ఒక స్కామ్‌.. ఎందుకంటే ఇంత లగ్జరీ కలను నెరవేర్చుకోవడమనేది నిజంగా తెలివితక్కువ పని. అయినా సరే నా మనసు ఇప్పటికీ ఆ పని చేయాలనే కోరుకుంటుంది అని ఎక్స్‌ వేదికగా రాసుకొచ్చింది. 

ఆ ట్రాప్‌లో చిక్కుకోకు
ఇది చూసిన జనాలు.. నిజంగానే ఎన్నో లక్షల మంది ఈ స్కామ్‌లో చేరుతున్నారు. అనవసరంగా ఇల్లు కొని జీవితాంతం ఈఎమ్‌ఐలు కడుతూ ఆ ట్రాప్‌లో చిక్కుకోకు.. అద్దెకు ఉంటేనే లైఫ్‌ ఏ బాధ లేకుండా ఈజీగా సాగిపోతుందంటూ పలువురు రకరకాలుగా సలహా ఇస్తున్నారు. 

జోష్‌ సినిమాలో..
మరికొందరేమో.. సామాన్య జనాలే అపసోపాలు పడి ఇల్లు కొంటున్నప్పుడు నీవంటి సెలబ్రిటీలకు ఇది పెద్ద విషయమేమీ కాదే! అని కామెంట్లు చేస్తున్నారు. కాగా శ్రేయ.. 2009లో వచ్చిన జోష్‌ సినిమాలో నటించింది. వై చాట్‌(2019) చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.2020లో వచ్చిన స్కామ్‌ 1992తో ాపులర్‌ అయింది. ప్రస్తుతం  అద్భుత్‌, నౌశిఖియే చిత్రాలు చేస్తోంది.

బిగ్‌బాస్‌ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement