Tollywood Movie Shooting To Restart From August 22nd, Details Inside - Sakshi
Sakshi News home page

Shootings Restart: షూటింగ్స్‌ రీస్టార్ట్‌పై కీలక ప్రకటన చేయనున్న ఫిల్మ్‌ ఛాంబర్‌

Aug 18 2022 1:03 PM | Updated on Aug 18 2022 4:17 PM

Shootings In Tollywood Going To Restart From August 22 - Sakshi

టాలీవుడ్‌లో త్వరలోనే షూటింగులు పునఃప్రారంభం కానున్నాయి. నేడు (గురువారం)ఫిల్మ్‌ ఛాంబర్‌ కీలక ప్రెస్‌మీట్‌ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీలో ప్రస్తుతం నిలిచిపోయిన షూటింగులు తిరిగి ప్రారంభించడంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసగా మూడు సినిమాలు హిట్‌ కావడం, బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతుండటంతో మళ్లీ షూటింగులు ప్రారంభించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఈనెల 22 నుంచే షూటింగులు ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా సినిమాలకు అవుతున్న అధిక బడ్జెట్‌,ఓటీటీ విడుదల సహా ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల కారణంగా ఆగస్ట్‌1 నుంచి షూటింగ్స్‌ను ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ వాయిదా వేసిన సంగితి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement