'శివ' రీ రిలీజ్.. మొదటిరోజు అన్ని కోట్ల కలెక్షన్ | Nagarjuna Shiva Movie Re-Release Day 1 Worldwide Box Office Collections Record, Check Out Collection Details | Sakshi
Sakshi News home page

Shiva Re-Release Collections: 36 ఏళ్ల తర్వాత రిలీజ్ చేస్తే.. ఇప్పుడూ అదే హంగామా

Nov 15 2025 4:24 PM | Updated on Nov 15 2025 4:52 PM

Shiva Rerelease Collection Day 1 Worldwide

నాగార్జున కెరీర్‌లో మైల్‌స్టోన్ లాంటి సినిమా 'శివ'. 1989లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. రాంగోపాల్ వర్మ అనే దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఓ రకంగా చెప్పాలంటే టాలీవుడ్ రూపురేఖల్ని ఈ చిత్రం మార్చేసిందని చెప్పొచ్చు. సౌండింగ్, సినిమాటోగ్రఫీని సరికొత్త పుంతలు తొక్కించిన ఈ చిత్రం.. తాజాగా రీ రిలీజ్ అయింది. ఇప్పుడు కూడా అద్భుతమైన వసూళ్లు అందుకుంది.

(ఇదీ చదవండి: రజనీకి నచ్చలేదు అందుకే.. మరెందుకు తొందర?)

అప్పట్లో రూ.కోటి రూపాయల బడ్జెట్ పెడితే రూ.4 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయట. దీంతో ఈసారి రీ రిలీజ్ చేద్దామని ఫిక్సవడంతో దాదాపు రూ.2 కోట్లు పెట్టి ఇప్పటి టెక్నాలజీకి తగ్గట్లు డాల్బీ సౌండ్, 4కె విజువల్స్ తీసుకొచ్చారట. గత కొన్ని నెలలుగా ఈ పనంతా రాంగోపాల్ వర్మ దగ్గరుండి చూసుకున్నారట. గత కొన్నిరోజులుగా కొత్త సినిమాలానే దీనికి కూడా ప్రచారం చేశారు. నాగ్, వర్మ కలిసి మీడియాతోనూ మాట్లాడారు. అలా థియేటర్లలోకి వచ్చింది.

తొలిరోజు (నవంబరు 14) తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ క్రమంలోనే రూ.2.5 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ వారం 'కాంత' తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం రాలేదు. బహుశా ఇదే 'శివ' రీ రిలీజ్ కలెక్షన్లకు కలిసొచ్చినట్లు ఉంది. మరి ఈ వీకెండ్ అయ్యేసరికి 'శివ' ఇంకెన్ని కోట్లు కలెక్షన్‌ సాధిస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్‌లో ఆ రెండు రిలీజ్.. రాజమౌళి క్లారిటీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement