ఇద్ద‌ర‌మ్మాయిలు ప్రేమించి మోసం చేశారు: హీరో | Shahid Kapoor Says Two Famous Exes Cheated On Him | Sakshi
Sakshi News home page

రెండు సార్లు ప్రేమలో విఫల‌మైన హీరో.. ఆ ఇద్దరి హీరోయిన్ల వల్లే?

Published Sun, May 5 2024 6:33 AM | Last Updated on Sun, May 5 2024 6:40 AM

Shahid Kapoor Says Two Famous Exes Cheated On Him

బ్రేక‌ప్‌కు కార‌ణం కొన్నిసార్లు అమ్మాయి కావొచ్చు, మ‌రికొన్ని సార్లు అబ్బాయి కావ‌చ్చు. లేదా ఏకాభిప్రాయంతో విడిపోవ‌చ్చు. అయితే త‌న విష‌యంలో మాత్రం ప్రేమించిన అమ్మాయిలే మోసం చేశారంటున్నాడు బాలీవుడ్ హీరో షాహిద్ క‌పూర్‌.

ఎన్నిసార్లు మోస‌పోయావు?
ఓ షోలో అత‌డికి మాజీ ప్రేమ క‌హానీల గురించి ప్ర‌శ్న ఎదురైంది. దీనిపై స్పందించేందుకు షాహిద్ ఒక‌టికి రెండుసార్లు ఆలోచించాడు. అయినా హోస్ట్ అడుగుతూనే ఉంది.. ప్రేమ‌లో ఎన్నిసార్లు మోస‌పోయావు?అని! ఇందుకతడు స్పందిస్తూ ఒకసారైతే దారుణంగా మోసపోయాను. మరో లవ్ కహానీలో చాలా డౌట్స్ ఉన్నాయి. నాకు తెలిసినంతవరకు ఇద్దరు నన్ను మోసం చేశారు. వారి పేర్లు మాత్రం చెప్పను అని చెప్పుకొచ్చాడు.

ఆ ఇద్ద‌రు హీరోయిన్లేనా?
వాళ్లిద్దరూ ఫేమస్ సెలబ్రిటీలా? అని అడగ్గా షాహిద్ దానికి సమాధానం చెప్పడానికి నిరాకరించాడు. ఇది చూసిన నెటిజన్లు ఆ ఇద్దరు సెలబ్రిటీలు మరెవరో కాదు ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ అని అభిప్రాయపడుతున్నారు. కాగా రెండుసార్లు ప్రేమలో విఫలమైన షాహిద్ 2015లో మీరా రాజ్‌పుత్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు, కుమారుడు సంతానం.

అన్ని పాత్ర‌ల్లోనూ
షాహిద్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. చుప్ చుప్‌కే సినిమాలో సాఫ్ట్ బాయ్‌గా క‌నిపించి మెప్పించాడు. ప‌ద్మావ‌త్‌లో మ‌హారావ‌ల్ ర‌త‌న్ సింగ్‌గా రాయ‌ల్ లుక్‌లో అల‌రించాడు. క‌బీర్ సింగ్‌లో యాటిట్యూడ్ స్టార్‌గా అద‌ర‌గొట్టాడు. ఇటీవ‌లే తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా అనే సినిమాతో హిట్ అందుకున్నాడు. ప్ర‌స్తుతం దేవ అనే సినిమా చేస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement