Shahid Kapoor: ‘నిర్మాతల వద్ద బిచ్చగాడిలా అడుకున్నా’

Shahid Kapoor says Kabir Singh Released After I Went To Producers Like Beggar - Sakshi

Shahid Kapoor: 200-250 కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తీసే పలువురు చిత్ర నిర్మాతల వద్దకు వెళ్లి తనతో ఓ సినిమా నిర్మించాలని ఓ బిచ్చగాడివలే అడుకున్నానని బాలీవుడ్‌ నటుడు షాహిద్ కపూర్‌ తెలిపారు. షాహిద్‌ నటించిన హింది ‘జెర్సీ’ మూవీ ట్రైలర్‌ను చిత్ర బృందం మంగళవారం రిలీజ్‌ చేసింది. అయితే ఈ సందర్భంగా ‘బాలీవుడ్‌ లైఫ్‌’ అనే మీడియాతో షాహిద్‌ మాట్లాడుతూ.. తాను కబీర్‌ సింగ్‌ మూవీ విడుదలైన తర్వాత పలువురు నిర్మాతల దగ్గరకు రోజూ వెళ్లానని తెలిపాడు.

వారంతా 200-250 కోట్ల బడ్జెట్‌తో సినిమాలు నిర్మించే పెద్ద నిర్మాతలని అన్నాడు. అయితే గతంలో తాను అటువంటి భారీ బడ్జెట్‌ క్లబ్‌లోకి చేరలేదని, కానీ ప్రస్తుతం జెర్సీతో ఆ ఫీట్‌ సాధించడంతో.. అది చాలా కొత్తగా అనిపిస్తోందని తెలిపాడు. ఇండస్ట్రీకి వచ్చి సుమారు 15-16 ఏళ్లు అవుతున్నా.. భారీ బడ్జెట్‌ మూవీ చేయలేదని అన్నాడు. చివరికి ఇలా సాధ్యమైందని తెలిపాడు. ఇది ఎక్కడివరకు వెళుతుందో తెలియదని.. కానీ తనకు చాలా కొత్తగా ఉందని పేర్కొన్నాడు.

షాహిద్‌ నటించిన తెలుగు రీమేక్‌ ‘జెర్సీ’ డిసెంబర్‌ 31న విడుదల కానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన  గౌతమ్‌ తిన్ననూరినే ఈ సినిమాను కూడా రూపొందించారు. క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షాహిద్‌ కపూర్‌కి జోడీగా మృణాల్‌ ఠాకూర్‌ నటించింది. పంకజ్ కపూర్, శిశిర్ శర్మ,శరద్ కేల్కర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. మంగళవారం విడుదలైన ‘జెర్సీ’ మూవీ ట్రైలర్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top